Tuesday, November 26, 2024

మానవ కర్తవ్యము

మానవులందరు సుఖము అపేక్షింతురు. అట్టి సుఖము భగవత్కృపచేతనే లభిం చును. ఆ కృపాలబ్దికి వివిధ సిద్ధాంత బోధకులు వివిధ మార్గములు సూచించి నారు. వైదిక మతమునకు ఒక విశిష్టతయున్నది. కాని అది బాహ్యశక్తుల ప్రాబల్యమయిన నివురుగప్పిన నిప్పువలె ఉండెనో అట్టి నమయమున ఆదిశంకరులు అవతరించి, బ్రహ్మ వస్తువొక్కటేయయ్యును వివిధ జీవరూపములలో వ్యక్తమగుచుండె ననియు, కాని ప్రతి వ్యక్తి అజ్ఞానముచే ఆ విషయములు గుర్తింపలేకున్నాడనియు, మన సులోని ఆ అజ్ఞానము తొలగింపబడకయున్నచో తన నిజస్వరూపము గ్రహంప లేడనియు, ఇట్టి స్వస్వరూప సాక్షాత్కారమునకు ముందు చిత్తశుద్ధి కలుగవలెననియు, అట్టి చిత్తశుద్ధి కలుగుటకు పుణ్యకర్మలాచరింపవలెననియు బోధించిరి. అట్టి పుణ్యకర్మ లు శంకరజయంత్యుత్సవములు, ఉమామహశ్వరవ్రతములు మొదలగునవి.
ఆయా మహాపురుషుల దేవతల గుణగణంబులు, వారి గొప్పదనము మన మనో వీధిపై ముద్రింపబడి మనస్సును నిష్కల్మము చేయును. సన్యాసులు ధర్మమును ప్రజల కు బోధింపవలెను. ధన కనక వస్తు వాహనాదులందు గల ప్రలోభముచే ప్రజలు స్వధర్మ మును విడనాడుట సంభవించు చున్నది.
బా#హ్యశక్తులకు లోబడి స్వీయధర్మమును పోగొట్టు కొన్నవారికి వైదిక ధర్మమున పున:ప్రవేశమున్నది అని, తన మన:ప్రవృత్తి మార్చుకొన్న వానికి పున:ప్రవేశమెందుకు కూడదు? ఇతరుల దుర్బోధలచే ధర్మచ్యుతి గావించుకొన్న వాడు ఆర్షధర్మమహత్త్వమును తెలుసుకొని తన తప్పును దిద్దు కొనవచ్చును. మరల ఆర్షధర్మ మును పాటించవచ్చును. పురు షుడు స్త్రీగాను, స్త్రీ పురుషుడు గాను మారలేరు. నిజమే, వారి జన్మ ఐచ్ఛికము కాదు కాబట్టి. కానీ స్త్రీగాని, పురుషుడుగాని తాము పోగొట్టుకొన్న స్వీయధర్మమును మరల పొందు టకెందుకు ప్రయత్నించగూడదు? ఒక మంచిపని చేయుటకు అందరికి అధికారము కలదు.
స#హనం వివేకం అలవరచుకోవాలి. అనుకోని ఒక విఘాతం ఏర్పడినపుడు ఉదా #హరణకు, త్రోవన పోయే ఒకనిని #హఠాత్తుగా పాముకాటు వెెసినది అనుకోండి, అది ఆకస్మికమైన విపత్తు. దానికి ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఇతరులను నిందించి పాముపై క్రోధం పెరిగి, దానిని చంపటానికి ప్రయత్నించి, అది కనపడకుండా పోయి, దానిపై పగ భయము పెంచుకుంటూపోతే చేయవలసిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది. దీనివలన ఏమి ప్రయోజనం? ఆ సమయములో స#హనము వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి. ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది. ఆ పాము కాటు వేయడానికి ఒక ప్రేరణ ఉంటుంది. దైవ ప్రేరణ లేనిదే చీమైనా కుట్టదు. ప్రారబ్ధానుసారం అలా జరుగుతూ ఉంటుందనుకోవాలి. అలా విచారణ చేయడమే వివేకం. ఈ విచారణను వివేకముచే స్థిరపరచుకొని నిర్ణయం చేసుకోవాలి.
ఈవిధమైన విచక్షణ చేయగలగడానికి ఎన్నో కఠినమైన పరిస్థితులు అవరోధాలు కూడ ఎదుర్కోవలసి వస్తుంది. వీటిని సహనంతో అధిగమించాలి. దీనినే తితిక్ష అంటారు. తితిక్షల వానికా శాస్త్రంపట్ల శ్రద్ధ కలుగుతుంది. గురు వేదాంత వాక్యాషు విశ్వాసమే శ్రద్ధ. శాస్త్రం ఏది విధించిందో అదే చేయాలి. దేనిని నిషేధించిందో దాన్ని మానెయ్యాలి. శాస్త్రం అలా ఎందుకు విధించింది? నిషేధించింది? అని పరిశోధన చేయకూడదు. శాస్త్రంపై పరిపూర్ణ విశ్వాసంతో ఉంటూ, అనిత్య వస్తువులపై విషయాలపై మనస్సు పోనివ్వకుండా ఇంద్రియాలను నిరోధించుకొనే, మళ్ళించుకొనే ప్రయత్నం చెయ్యాలి.
(జగద్గురు శ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఉపదేశం నుండి)

Advertisement

తాజా వార్తలు

Advertisement