సంవత్సరం పొడవునా 365 రోజుల్లో 470కి పైగా ఉత్స వాలు తిరుమలలో జరుగుతాయి. వీటిలో సింహ భాగం సేవలు మలయప్ప స్వామికే. మూలవిరాట్టు ప్రతినిధిగా, ఉత్సవ మూర్తిగా ఎన్నో అభిషేకాలు, స్నపన తిరుమంజనా లు ఆయనకే. అంగాలు (నేత్రాలు, ముక్కు, చెవులు వంటి వి), మహాంగాలు (శిరస్సు, కంఠం, ఉదరం, బాహువులు వంటివి), ఉపాంగాలు (కేశాలు, నఖం వంటివి), ప్రత్యాం గాలు (శంఖు చక్రాలు, మకుటం, పీఠం వంటివి) తరుగుల కు గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకుండా చూసేందుకు ఉత్సవ.మూర్తిని రక్షించే ప్రక్రియను భృగువు క్రియాధికారంలో వివరించారు. ఆ రక్షించే ప్రక్రియే జ్యేష్ఠాభి షేకం. దీన్ని సుగంధ తైల సమర్పణోత్సవం, అభిదేయక అభిషేకం అని కూడా పిలుస్తారు.
నిత్యకల్యాణం పచ్చతోరణంలా విరాజిల్లే ఆనంద నిల యంలో జ్యేష్ఠాభిషేకానిది ప్రత్యేక స్థానం. ఏటా జ్యేష్ఠ మాసం లో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జరి గేదే ఈ ఉత్సవం. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో కలిసి ఉన్న మాసంలో విశేషమైన సుగంధతైల సమర్పణం చేయాలని భృగువు వివరించారు. దీనివల్ల విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో వెలుగొందుతారని చెప్పారు. దీని ప్రకారమే తిరుమలలో జ్యేష్ఠాభిషేకం జరుగుతోంది.
జ్యేష్ఠాభి షేకం
ప్రారంభంలో యధావిధిగా సుప్రభాతం, తోమాలసేవ, సహస్ర నామార్చన, నైవేద్యం, రెండో అర్చన, రెండో నివేదన జరిగిన అనంతరం మలయప్ప స్వామివారు ఆనంద నిల యం గర్భాలయం నుంచి నిత్య కల్యాణం జరిగే వేంకట రమణ కల్యాణ మంటపానికి చేరుకుంటారు. స్వామివారి సన్నిధిలో యాగశాలలో శాంతి హోమం చేస్తారు. శత కలశ ప్రతిష్ఠ, ఆవా#హన, నవ కలశ ప్రతిష్ఠ, ఆవా#హన పూజలు నిర్వ#హస్తారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పించి కంకణ ప్రతిష్ఠ చేస్తారు. అనంతరం స్వామి వారికి అర్ఘ్యపాద ఆచమనీయం సమర్పించి కంకణ ధారణ చేస్తారు. తర్వాత హోమాన్ని పూర్తి చేసి హోమ తిలకాన్ని స్వామివారికి దిద్దు తారు. వేద పండితులు శ్రీసూక్తం, పురుష సూక్తం, భూ సూ క్తం వంటివి పఠిస్తుండగా శుద్ధ జలాలలో అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్లతో, శత కలశాల్లోని జలాలతో స్వామికి స్నపన తిరుమంజనం చేసి స్వామి, అమ్మవార్లను చందనంతో అలంకరిస్తారు.
తర్వాత నవ కలశాల్లోని జలాలతో అభిషేకిస్తారు. ఆ జలాలను అర్చక స్వామి శిరస్సుపై చల్లుకుని భక్తులందరిపై పురోభవ అని చిలకరిస్తారు. తర్వాత స్వామికి వస్త్రాలంకర ణ, నివేదన జరుగు తాయి. ఇలా రెండో, మూడో రోజు కూడా జరుగుతుంది. జ్యేష్ఠాభిషేకం చివరిరోజు స్వామివారికి స్వర్ణ కవచం ధరింపజేస్తారు. వివిధ సేవలు, ఉత్సవాలను జరిపిం చుకుంటూ భక్తులకు దర్శనమిచ్చే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఎప్పుడూ కవచాన్ని ధరించి ఉం టారు. కేవలం జ్యేష్ఠాభిషేక సమయంలోనే స్వర్ణ కవచాన్ని తొలగిస్తారు. ఈ ఒక్క సందర్భంలోనే మలయప్ప నిజ రూపంలో దర్శనమిస్తారు.
ఏడాది పొడవునా కేవలం శుద్ధజలంతో మాత్రమే మలయప్ప స్వామికి శిరస్సు పైనుంచి అభిషేకం జరుగు తుంది. ఈ జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే స్వామిని అన్ని ద్రవ్యాలతో అభిషేకిస్తారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’ అని కూడా అంటారు. ఈ ఏడు తిరుమల శ్రీవారి ఆల యంలో జూన్ 19వ తేదీన మొదలైన మూడు రోజుల ఈ జ్యేష్ఠాభిషేక ఉత్సవం నేటి (21వ తేదీ) తో ముగుస్తుంది.
మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయ ప్ప స్వామికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నప న తిరుమంజనం నిర్వ#హంచారు. తర్వాత స్వామి, అమ్మ వార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగించా రు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిం చారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వ#హస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లి జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమే త శ్రీ మలయప్పస్వామి వారు బంగారు కవచంతోనే ఉంటారు.
మలయప్పస్వామి జ్యేష్ఠాభిషేక మహోత్సవం
Advertisement
తాజా వార్తలు
Advertisement