శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం నుంచి మకరు విళక్కు పూజలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 26న మండలపూజ అనంతరం ఆలయాన్ని మూసివేసి సోమవారం సాయంత్రం తెరిచిన సంగతి తెలిసిందే. జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ తెల్లవారుజామున 3.30 నుంచి 11 గంటల వరకు నెయ్యి అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 14న మకరజ్యోతి, జనవరి 20న పడిపూజతో మకర విళక్కు యాత్ర ముగియనుంది.
కాగా, అయ్యప్ప స్వామి దర్శనాల కోసం వర్చువల్ క్యూ టికెట్ల బుకింగ్ 15వ తేదీ వరకు పూర్తయినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. వర్చువల్ క్యూ దర్శనం టికెట్ బుక్ చేసుకోని వారికి స్పాట్ బుకింగ్ ఒక్కటే ఆప్షన్ అని తెలిపారు.