Wednesday, November 27, 2024

మహిమాన్వితాలు…పంచపర్వాలు

కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతు న్నది. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్ధం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్ర మాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, ఆధ్యాత్మిక అంశాల శ్రవ ణం, దీపారాధనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం మున్నగునవి. కాగా వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం.
జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. ”చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం.”
అంబా దులా నితంతీ చ, అభ్రయంతి తథైవ చ, వర్షయంతి చపుణికా, షడ్‌ ఏతే కృత్తికా స్మృతా… అంబా, దులా, నితంతీ, అభ్రయంతీ, వర్షయంతీ, చపూణి కా అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాసమునకు అధిపతులు.
కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియములుగా చెప్పబడ్డాయి. ‘నక్షత్రం దేవ మింద్రియం అని శృతి వచనం. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతల కు అందించే నక్షత్రం కృత్తికా. అట్టి కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణిమాస్య కలి గిన ఈ మాసము కార్తీక మాసముగా, విశేష పుణ్య ఫలదముగా చెప్పబడింది. చాంద్రమాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కల దు. శరదృతువు ఉత్తర భాగములో వచ్చే కార్తీక మాసము నెల రోజులు పర్వ దినాలుగానే భావిస్తారు.
ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ”పంచ పర్వాలుగా” భావించ బడతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి- ఉత్థాన ఏకాదశి ప్రత్యేకత ననుసరిం చి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాస ములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడుచున్నవి. మహా విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును కావున, దీనిని ”ఉత్థాన ఏకాదశి” అని కూడా పిలుస్తారు. పీఠాధిపతులు, యతీశ్వరులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆహార నియమాలతో చేయడం జరుగుతున్నది. కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ”ఉత్తాన ఏకాదశి” లేదా ప్రభోదనైకాదశి” అంటారు. ప్రబోధ నైకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలు దేరి ”క్షీరాబ్ది ద్వాదశి”, ”చిలు కు లేదా మదన ద్వాదశి”, ”యోగిని ద్వాదశి” నాడు విష్ణువు….లక్ష్మి. బ్రహ్మ మున్నగువారితో కలిసి బృందావనంలో ప్రవేశిస్తాడు. దీనిని క్షీరసాగరాన్ని మధించి న చిలికిన దినంగా వ్యవహరిస్తారు. అమదేర్‌ జ్యోతిషీ గ్రంథ ప్రకారం చాతుర్మాస్య వ్రత సమాపన దినం. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది కార్తీక శుద్ధ త్రయోదశి. విష్ణువు శంకరుడిని పూజించిన దినం ”వైకుంఠ చతుర్దశి”. ఇది జాగరణ వ్రతం, ప్రతిమా వ్రతం, లింగ వ్రతం, ప్రబోధ వ్రతాలకు ఉద్దీపితమైనది. ”కార్తీక పౌర్ణమి” శివునికి ప్రీతి పాత్రం. ముక్కంటి త్రిపురాసుడిని #హతమార్చిన దినం. పార్వతిదేవి పాప పరిహారార్ధం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతుర్మాస్య వ్రతారంభ దినం.
ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరించడం సనాతన సాంప్రదాయా చారం. దేవాలయాలలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షి ణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజ లొనరిస్తారు. మంగళ స్నానాలాచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలిపెడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement