Tuesday, November 26, 2024

మహౌన్నత శక్తిమంతుడు సాయిబాబా

శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రవచించినట్లు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు, ధర్మానికి తీవ్ర హాని కలిగినప్పుడు ధర్మ సంస్థాపనార్ధం ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలొ  అవతరిస్తూ వుంటాడు. ఆ ప్రకారంగానే దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనలను సంకల్పంగా చేసుకొని, ఆ పరమేశ్వరుడు ఒక ఫకీరు రూపంలో సాయినాథుని నామముతో 19వ శతాబ్దంలో ఈ భువిపై అవతరించారు. తన అపార మైన యోగశక్తితో లక్షలాదిమందికి అనితర సాధ్యమైన రోగాలెన్నింటినో పోగొట్టారు. కేవలం చేతి స్పర్శతోనే ఎంతోమందికి కంటిచూపు తెప్పించారు. తనకు సంపూర్ణంగా సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు అన్నివేళలా వెన్నంటి వుండి కాపాడిన అవాజ్య కరుణామూర్తి శ్రీ సాయి. ఆ కలియుగంలోనే ఏ ఇతర యోగులకు సాధ్యంకాని విధంగా తన యోగశక్తిని ప్రదర్శించిన మహోన్నత శక్తిమంతుడు, భక్తుల పాలిట ఆపద్భాంధవుడు అయిన శ్రీ సాయి యోగశక్తిని గూర్చిన కొన్ని లీలలను ఇప్పుడు మనం స్మరించుకుందాము.
బాబా తన యోగ శక్తితో నీళ్ళను నూనెగా మార్చి మశీదులో దీపాలను వెలిగిం చిన వైనం ఇంతకుముందు చదివాము. మరొక సందర్భంలో నానా సాహబ్‌ డెంగలే అను భక్తుడు నాలుగు మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బా బా పడుకోవడానికని తీసుకువచ్చాడు. ఆ బల్లను నేలపై వేసుకొని బాబా దానిపై పడు కొని, తనను ఆశీర్వదించాలన్నది డెంగలే కోరిక. అయితే అందుకు భిన్నంగా బాబా ఆ బల్లను నాలుగు చింకి గుడ్డ పీలికలతో మశీదు దూలానికి ఉయ్యాలవలే వేలాడదీశారు. అంతేకాక, రాత్రిళ్ళు ఆ బల్లపై పడుకోవడం ప్రారంభించారు. ఆ గుడ్డ పీలికలు చిరిగి పోయిన స్థితిలో వుండి బల్ల బరువును మోయడమే గగనం. అందునా ఆజానుబాహు డైన బాబా బరువును మోయడం అసాధ్యం. కాని తన యోగశక్తితో అసాధ్యాలను సాధ్యాలుగా చేసే సాయి అ బల్లకు నాలుగు వైపులా ప్రమిదలలో దీపాలను వెలిగించి హాయిగా నిద్రపోయేవారు. అది చూసిన వారందరూ ముక్కున వేలేసుకున్నారు. అంత ఎత్తులో వున్న ఆ బల్లపై పడుకోవడానికి బాబా ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవ్వరికి అర్ధమయ్యేది కాదు. ఈ చర్య వెనుక వున్న మర్మం కనిపెట్టాలని ఎందరో కాచుకు కూర్చునేవారు. కాని ఎవ్వరికీ ఈ రహస్యం తెలియలేదు, బాబా తన సన్ని#హ తులకు తెలియనివ్వలేదు. రానురాను ఈ వింత చూడడానికి ప్రజలు గుంపులు గుంపు లుగా గుమిగూడి వుండడం చూసిన బాబా విసుగుచెంది ఆ బల్లని విరిచి బయటపార వేసారు. హమాద్‌పంతు సాయి సచ్చరిత్రలో వ్రాసినట్లుగా అష్టసిద్ధులు బాబా ఆధీనం లో వుండేవి. వాటిని సాధించుటకు బాబా ఏనాడు ఏరకమైన అభ్యాసము చెయ్యలేదు. వారు పరిపూర్ణ భగవత్స్వరూపులు గనుక అవి సహజంగానే బాబాకు సిద్ధించాయి. మ#హనీయులైన ఆనందసాయిస్వామి బాబా లీలలన్నింటిలో ఈ శయన లీల బహు గొప్పదని, ఈ లీలను ఒకే ఆసనంపై కూర్చొని పదకొండుసార్లు పారాయణ చేసిన సాయి కరుణా కటాక్షములకు పాత్రులమై బ్రహ్మ జ్ఞానం సిద్ధిస్తుందని తెలియజేసారు.
ఇప్పుడు బాబా యోగశక్తిని తెలిపే మరొక అద్భుతమైన లీలను చూద్దాం. సాధా రణంగా యోగులందరూ తమ ప్రేవులను శుభ్రపరచుకునేందుకు ధౌతి క్రియను చేస్తా రు. అనగా 3 అంగుళములు వెడల్పు, 22 1/2 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో ఒక అరగంట వరకు ఉంచి ఆ తరువాత నెమ్మదిగా తీసివే స్తారు. కాని బాబా చేసిన ధౌతి క్రియ అసాధారణమైనది. సాయి స్నానము చేయడానికి ఊరి చివర బావి వద్దకు వెళ్ళినప్పుడు తన ప్రేవులను బయటకు తీసి, వాటిని నీటితో శుభ్రపరిచి, పక్క నున్న చెట్టుపై ఆరబెట్టి తిరిగి లోపలికి మింగేసేవారు. ఆ దృశ్యాన్ని చూసిన కొంత మందికి నోట మాట రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement