Saturday, November 16, 2024

మహోన్నతమూర్తి సమతా స్ఫూర్తి

అటు అష్టాక్షరీ జపం ఇటు మహాక్రతువు
పది మంది జీయర్ల పర్యవేక్షణలో పూజలు
నేడు వసంత పంచమి శుభవేళ శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు

వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి రామానుజాచార్యులు. ఆయన మళ్ళీ ఇప్పుడు దర్శనమిస్తున్నారా అన్నట్లుగా 45 ఎకరాల విస్తీర్ణంలో స్వర్ణశోభిత శిల్పకళతో కళ్ళుచెదిరే నిర్మాణంతో ఐక్యతా మూర్తి ముచ్చింతల్‌లో కొలువై వున్నారు.ఎటుచూసినా పచ్చని మొక్కలు, విభిన్న రంగులతో వున్న పూల మొక్కలతో పచ్చని ఆహ్లాద వాతావరణంలో, ఆధ్యాత్మిక సుగంధాల మధ్య ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టుగా వుండే 216 అడుగుల ఎత్తులో వెలిశారు జగద్గురువులు…

54 అడుగుల ఎత్తులో వున్న భద్రవేదిపై రామానుజలవారి దివ్యమంగళ స్వరూపం కొలువైంది. ‘భద్రవేదీం త్రివేదీం.’ అంటారు. మూడు వేదాల యొక్క భద్రవేదికను ఆధారం చేసుకుని నిలబడినవారుట రామానుజాచార్యులు. ఆ వేదాలే ఆయనకు బేస్‌. అందుకే జీయర్‌స్వామి దీనికి భద్రవేది అని పేరు పెట్టారు. అలాటి భద్రవేదిక కిందవున్నది 54 అడుగులు. ఈ క్షేత్రం అంతా తొమ్మిదితో ముడిపడి వుంది. రామానుజులవారి శ్రీమూర్తిని పంచలోహాలతో చైనాలో తయారుచేశారు. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులలో మేళవించి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. దీన్ని తయారుచేయడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టింది. 1800 టన్నులు బరువుతోవుండే విగ్రహాన్ని 1600 భాగాలుగా తయారుచేశారు. చైనా నుంచి వాటిని తీసుకువచ్చి 60మంది నిపుణులు ఇక్కడ తుదిరూపునిచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకుని వెయ్యి సంవత్సరాలు వుండేట్లుగా తయారుచేశారు. ఇందులో 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది. ఇందులో 36 ఏనుగులు, 108 పద్మదళాలు ఉంటాయి. ఈ పద్మపీఠం 108 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో ఉంటుంది. 2,700మంది శిల్పులు ఈ క్రతువులో పాల్గొన్నారు.
పద్మపీఠంపై భగవద్‌ రామానుజులవారి విరాట్‌మూర్తి కొలువైవుంది.
ఐక్యతా మూర్తిలో అద్భుతాలెన్నో…
శ్రీ రామానుజులవారు శ్రీమూర్తి పాదాల నుండి శిరస్సు వరకు 108 అడుగుల ఎత్తులో ఉంటారు.
శిరస్సుపై నుండి త్రిదండం 27 అడుగుల ఎత్తులో ఉంటుంది. త్రిదండం బరువు 60వేల కిలోలు.
త్రిదండంపైన ఉండే జలపవిత్రం (జెండాలాంటి ఆకృతి) 6వేల కేజీల బరువుతో ఉంటుంది.
జలపవిత్రం ఎత్తు 13 అడుగులు, వెడల్పు 18 అడుగులు, వైశాల్యం 234 అడుగులు.
స్వామివారి మెడలో వున్న తులసిపూసల మాలలో వున్న ఒక్కొక్క తులసిపూస ఎత్తు 1.6 అడుగులు, వెడల్పు 1 అడుగు.
యజ్ఞోపపీతం ముడి ఎత్తు 63 అడుగులు, వెడల్పు 54 అడుగులు.
ఒక్కొక్క దారం మందం 9 అంగుళాలు
82 శాతం రాగితోపాటు, బంగారం, వెండి ఇతర లోహాలను వినియోగించారు.

స్వామివాకి అంజలి

హస్తం ఎత్తు 24 అడుగులు, వెడల్పు 12.6 అడుగులు
బొటనవేలు ఎత్తు 6.6 అడుగులు, మందం 2.6 అడుగులు
చూపుడువేలు ఎత్తు 10.9 అడుగులు, మందం 2.3 అడుగులు
మధ్యవేలు ఎత్తు 11.6 అడుగులు, మందం 2-3 అడుగులు
ఉంగరపు వేలు ఎత్తు 10 అడుగులు, మందం 2.1 అడుగులు
చిటికెన వేలు ఎత్తు 7.0 అడుగులు, మందం 1.11 అడుగులు
తిరుమణి ఎత్తు 14 అడుగులు, వెడల్పు 8.6 అడుగులు
పాదం ఎత్తు 10 అడుగులు
పాదం బొటకనవేలు పొడవు 6.0, మందం 3.6 అడుగులు
శ్రీశఠారి ఎత్తు 18 అడుగులు
పద్మపీఠం చుట్టు కొలత 108 అడుగులు.
ఉజ్జీవన సోపానాలు. 108 అంటే భద్రవేదిపైకి అంటే భగవద్‌ రామానుజుల వారి విరాట్‌ మూర్తి సన్నిధికి తీసుకువెళ్లే మెట్లను ‘ఉజ్జీవన సోపానాలు అంటారు.
శ్రీరామానుజాచార్యుల విగ్రహం కొలువు దీరిన మొత్తం విస్తీర్ణం 45 ఎకరాలు అంటే 4 ప్లస్‌ 5 9.
విగ్రహం ఎత్తు 216 అడుగులు. 2 ప్లస్‌ 1 ప్లస్‌ 6 మొత్తం 9.
భద్రవేది ఎత్తు 54 అడుగులు 5 ప్లస్‌ 4 9
పద్మపీఠం ఎత్తు 27 అడుగులు 2 ప్లస్‌ 7 9
పద్మపీఠంలోని మొత్తం ఏనుగుల సంఖ్య 36 3 ప్లస్‌ 6 9
పద్మపీఠంపై ఉన్న శంఖుచక్రాలు 36 3 ప్లస్‌ 6 9
త్రిదండం పొడవు 144 అడుగులు 1 ప్లస్‌ 4 ప్లస్‌ 4 9
త్రిదండం బరువు 54 టన్నులు 5 ప్లస్‌ 4 9
శ్రీ శఠారి పొడవు 18 అడుగులు 1 ప్లస్‌ 8 9
స్వామివారి ఒక్కొక్క నేత్రం 4. 5 అడుగులు అంటే 4 ప్లస్‌ 5 9. రెండు నేత్రాలను కలిపి లెక్కించినా 9
లీలానీరాజనం (ఫౌంటెయిన్‌) 36 అడుగులు 3 ప్లస్‌ 6 9
చుట్టూ ఉన్న దివ్య దేశాలు 108 1 ప్లస్‌ 0 ప్లస్‌ 8 9.
క్రతువులు 2700 2 ప్లస్‌ 7 0
హోమకుండాలు 1035 కలిసితే 9.
అంతేకాదు స్వామివారి సువర్ణమూర్తిని మందిరంలోకి చేర్చిన సమయం రాత్రి 11.25 నిమిషాలు. అంటే 1 ప్లస్‌ 1 ప్లస్‌ 2 ప్లస్‌ 5 మొత్తం కలిపితే 9. అని చినజీయర్‌ స్వామి చెప్పారు. సాయం త్రం నాలుగు గంటల నుంచి ప్రారంభిం చారు. చాలాచాలా సమయం పట్టింది. రాత్రి 11.25 నిమిషాలకు విగ్రహం యథాస్థానానికి చేరిందని, అంటే తొమ్మిది. ఆ సమయానికి విగ్రహం యథాస్థానానికి చేరడం యాదృచ్ఛికమని చినజీయర్‌స్వామి అన్నారు, ఇది ఆచార్యుడి లక్షణం. దీన్ని అందరం అందుకుందాం. అందరికి అందిద్దాం.

- Advertisement -

అటు అష్టాక్షరీ జపం ఇటు మహాక్రతువు
పదిమంది జీయర్ల పర్యవేక్షణ

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: మూడో రోజు కార్యక్రమంలో భాగంగా యాగశాలలో అష్టాక్షరీ మహామంత్ర జపంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమ య్యాయి. ఆపై హోమాలు, చతుర్వేద పారాయణాలను నిర్వహించారు. 5 వేల మంది రుత్విజులు శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువును కొనసాగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేద పండితులచే వేదపారాయణం అంగరంగ వైభవంగా జరిగంది. యాగంలో 10 మంది జీయర్‌ స్వాములు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ నారాయణ క్రతు వులో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామివారు నిత్య ఆరాధనాగోష్ఠిని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆసాంతం మైహూమ్‌ గ్రూప్‌ సంస్థల అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. ప్రవచన మండపంలో ఈరోజు శ్రీచిన్నజీయర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో లక్ష్మీ నారాయణ అష్టోత్తర శతనామావళి పూజను భక్తులచే నిర్వహింపజేసారు. భక్తులు ఈ కార్యక్రమంలో స్వామివారి ఉప దేశానుసారం భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. అయోధ్య నుంచి విచ్చేసిన శ్రీ విద్యాసాగర స్వామి సంస్కృతంలో రామానుజ స్వామి వారి విశిష్టతను, శ్రీరామ నగర విశేషా లను వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్‌ కృష్ణ మాచా ర్యులు కూడా పాల్గొన్నారు. భద్రాచలం శ్రీసీతారామచం ద్రస్వామి ఆలయ స్థానాచార్యులు ప్రవచనకర్త శ్రీమాన్‌ స్థలసాయి రామానుజ వైభవంపై ప్రవచనాన్ని అందించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ ప్రవచనకర్త రంగనాథ భట్టర్‌ వారిచే రామానుజుల దివ్య ప్రవచనాన్ని అందించారు. అనంతరం ప్రవచన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజ్ఞా మనోజ్ఞ సంగీతం, పేరిందేవి బృందం నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమ సుమిత సంగీతం, మానస బృందంవారి భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ జరిగింది. యాగశాలలో సాయంత్ర హోమాలు శాస్త్రోకంగా జరిగాయి. లక్ష్మీనా రాయణ క్రతువులో భాగంగా చతుర్వేద పారాయణాలు వేదపండితులచే ఘనంగా నిర్వహించారు.

నేడు సమతామూర్తి విగ్రహావిష్కరణ
హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు ఆసన్నమయ్యాయి. హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌ శ్రీరామనగ రంలో శనివారం భగవద్రామా నుజుల సహస్రాబ్ది ఉత్సవా ల్లో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. సమతా మూర్తి రామానుజుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీరామ నగర పరిసర ప్రాం తాల్లో భద్రతా ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి పరిశీలించారు. హేలీప్యాడ్‌, సమతామూర్తి ప్రాంగణం, యాగశాలల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాగశాల చుట్టూ మెటల్‌ డిటెక్టర్లను అమర్చారు. ముచ్చిం తల్‌ శ్రీరామనగరం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది.

రామానుజ సువర్ణమూర్తికి నిత్యపూజ
ఇది భద్రవేది ప్రథమ తలంలో వుంది. 27000 అడుగుల చదరపు అడుగుల మందిరం. రామానుజుల వారి సువర్ణమూర్తి 54 అంగుళాల ఎత్తు వుంది. కింద వున్న పీఠం ఎత్తు 36 అంగుళాలు. 120 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం అనుభవించిన రామానుజలవారికి గుర్తుగా సువర్ణమూర్తి విగ్రహాన్ని 120 కేజీలు బంగారంతో తయారుచేశారు. నిత్యపూజా మూర్తిగా దీన్ని ఏర్పాటుచేశారు. 12వ తేదీన రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌ ప్రారంభించనున్న ఈ సువర్ణ మూర్తికి ప్రతిరోజూ అభిషేకం, నిత్యారాధన జరుగుతాయి. భక్తులు అందరూ కూర్చుని చూసేవిధంగా అత్యంత విశాలమైన మండపాన్ని రూపొందించారు. దీనిలో 48 స్థంభాలున్నాయి. వీటిని నక్షత్ర స్థూపాలంటారు నక్షత్రాకృతిలో తయారుచేశారు. అంటే నక్షత్రాల మధ్య చంద్రుడిలా మనకు రామానుజులవారు దర్శనమిస్తారు. ఈ మండపంలో వేదాంత శాస్త్రంలో 32 బ్రహ్మవిద్యలున్నాయి. ఇవి మనిషి ఎదుగుదలకు ఉపయో గపడతాయి. ఒక్క బ్రహ్మవిద్యను తెలుసు కోవడానికే జీవితం సరిపోదు. అందుకే ఇక్కడున్న స్తంభాలపై 32 బ్రహ్మవిద్యల శిల్పాలను రూపొం దిస్తున్నారు. ఇక్కడకు వస్తే హెడ్‌ఫోన్‌ సెట్‌ ఇస్తారు. దాన్ని పెట్టుకుని వింటే ఆ స్తంభంలో వున్న విద్యల గురించి అంతా తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఆధ్యాత్మిక కేం ద్రం కాదు. మనిషికి జ్ఞానాన్ని ప్రచోదనం చేసే స్థానంలా వుండాల న్నది జీయర్‌స్వామి కోరిక. ఏ ఆలయం అయినా జ్ఞానాన్ని ప్రబోధిం చేలా ఆనందాన్ని పెంచేలా వుండాలి కానీ విహార కేంద్రంలా వుండ కూడదు అనే ఉద్దేశంతోనే జీయర్‌స్వామి ఏర్పాటుచేశారు.అలాగే ఇక్కడున్న 48 స్థంభాలపై రామానుజాచార్యుల జీవిత చరిత్ర అంతా తెలిసేలా, ఆయన జీవితచరిత్ర అంతా చిత్రాలపై చిత్రించి ఏర్పాటుచేస్తున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాలు వుండేటట్లుగా ఆ చిత్రపటాలను తయారుచేస్తున్నారు.
భద్రవేది 2వ అంతస్తు
ఇది 16,740 చదరపు అడుగుల విశాలమైన ప్రాంగణం. ఇందులో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. దీన్ని రాజస్థాన్‌లో దొరికే అందమైన సాండ్‌ స్టోన్‌ అయిన ‘బన్సీ పహడ్‌ పూర్‌ పింక్‌ స్టోన్‌’తో అలంకరించారు. పూర్తిగా ద్రవిడ సంప్రదాయ ఆలయాల తరహాలో రూపొందించిన ఈ భద్రవేది ఉత్తర భారతదేశ శిల్పులతో నిర్మించబడింది. ఈ నిర్మాణా నికి సుమారు 2 లక్షల సిఎఫ్‌ఎస్‌ రాయిని ఉపయోగించారు.

అష్టదిగ్బంధన చూర్ణం

దేవాలయాల్లో దేవతామూర్తులను ప్రతిష్ట చేసిన తర్వాత విగ్రహాలను బంధనం చేస్తారు. ఈ సంప్రదా యం తమిళనాడులో వాడుకలో వుంది. తమిళనాడులో శిల్పకళల్లో ప్రావీణ్యంకల పెద్దవారు ఆలయాల్లో విగ్రహా లను ప్రతిష్ట చేసిన తరువాత విగ్రహాల కింద ఓ పదార్థంతో బంధనం చేస్తారు. దీన్ని అష్టదిగ్బంధనం అంటారు. దీనికి ప్రత్యేకంగా చూర్ణం తయారుచేస్తారు. ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి ఆ చూర్ణం తయారు చేస్తారు. చిన్నగు గ్గిలం, కావి, పెద్దగుగ్గిలం, ఆవు వెన్న, చాదులింగం అనే ఒక ద్రవ్యం… ఇలా ఎనిమిది రకాల ద్రవ్యాలను రోట్లో వేసి బాగా దంచుతారు. ఎంతో బలంగా కొట్టే వేడికి అది కరుగు తుంది. చూర్ణంలా తయారవుతుంది. మొత్తం ఇక్కడ నెల కొల్పిన ఈ 108 దివ్య దేశాల్లో వున్న మూర్తుల బంధనా నికి ఈ చూర్ణం వాడతారు. మొత్తం 450 కేజీల అష్ట దిగ్బంధన చూర్ణం తయారు చేస్తున్నారు.

శ్రీరామానుజుల ధ్వజస్తంభం
సాధారణంగా దేవాలయాల్లో ధ్వజస్తంభాలు వుంటాయి. కానీ భారతదేశంలో రామానుజులు పూజలందు కుంటున్న ఆలయాల్లో ధ్వజస్తంభాలు లేవు. సాక్షాత్తు రామానుజులు ఆవిర్భవించింది శ్రీపెరంబదూరు. అక్కడ ఆలయంలో కూడా ధ్వజస్తంభం లేదు. రామానుజులవారు శ్రీరంగంలో శరీరాన్ని వదిలిపెట్టారు. సాక్షాత్తు రంగనాథులు రామానుజులవారి శరీరాన్ని తన ఆలయంలోనే వుంచుకున్నారు. రంగనాథుడు రామానుజుల శరీరాన్ని గుడిలోనే పెట్టమని అర్చకులకు చెప్పి అక్కడే రామానుజులు భౌతిక శరీరాన్ని వుంచారు. ఆ పవిత్ర ఆలయంలో కూడా ధ్వజస్తంభం లేదు. రామానుజులు నిత్యపూజలు అందుకుంటున్న మేల్కోటలోనూ ధ్వజస్తంభం లేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీరామానుజులవారి ధ్వజస్తంభాన్ని శ్రీ చిన్నజీయర్‌ స్వామివారు ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఆరువందల సంవత్సరాల క్రితం భగవంతుడు చెప్పే వేదానికి ప్రతీక. ఆలయానికి వెళితే ధ్వజస్తంభానికి నమస్కరించి లోపలికి వెళ్ళాలి. నేను లోపల వున్న దేవుడిని, శాస్త్రాన్ని విశ్వసిస్తున్నాను అని చెప్పడానికి ప్రతీక ధ్వజస్తంభం. దీని పొడవు 540 అంగుళాలు. ఇది కూడా తొమ్మిదితోనే మూడిపడి వుంది. ఈ ధ్వజస్తంభం పైన ఏర్పాటుచేసే తొడుగుపై నవగ్రహాలు, అక్షమంగళాలు, ద్వాదశ రాశులతో కూడిన రూపాలను తయారుచేయిస్తున్నారు.

నీలా జలతరంగిణి
మహాప్రవక్త రామానుజులవారి దివ్యమూర్తి ఎదురుగా అద్భుతమైన శిల్పకళతో ‘నీలా జలతరంగిణి’ స్థూపం వుంది. దీని పొడవు 36 అడుగులు. నీలాజలతరంగిణి స్థూపం చుట్టూ 108 చదరపు అడుగుల విస్తీర్ణంలో పద్మం ఆకారంలో వుంది. అంటే తొమ్మిది. ప్రాజెక్టులో అన్నీ తొమ్మిదే. తొమ్మిది మనిషిలో వుండే వికారాలన్నిటినీ తొలగిస్తుంది. అందుకే తొమ్మిది అవికారి అయింది. మార్పు చెందనిది అని అర్థం. స్వామివారి లక్ష్యం కూడా అదే. సన్నిధానానికి వచ్చేవారందరికి మంచి ఆలోచనలను రావాలి. మనసులో వుండే వికారాలు తొలగిపోయి పరిశుద్ధులు కావాలనే వుద్దేశంతో ఈ దివ్యక్షేత్రం అంతా తొమ్మిదితో నిక్షిప్తమై వుంది.
నీలాజల తరంగిణి స్థూపంలో రామానుజులవారు వుంటారు. రోజూ సాయంత్రం రామానుజలవారు పైకి వచ్చి గుండ్రంగా తిరుగుతారు. అలా లోకాన్నంతటిని వీక్షిస్తారు. గురువు మంచినిచ్చి చెడును నెట్టేవారిలా వుండాలి. అందుకే గురువులను రాజహంసలతో పోలుస్తారు. దానికి సంకేతంగా పాలను, నీళ్ళను వేరుచేసే ఎనిమిది హంసలను ఈ స్థూపంపై ఎనిమిది దిక్కుల్లోను ఏర్పాటుచేశారు. అలాగే ఎనిమిది ఏనుగులను ఎనిమిది దిక్కులను రక్షించే గజాల్లా నెలకొల్పారు. అవే అష్టదిగ్గజాలు. అలాగే ఎనిమిది చిన్నచిన్న కమలాలను ఏర్పాటుచేశారు. ఆ కమలాల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క జీవరాశులు వుంటాయి. పూర్తిగా జలంలో ఉండే జంతువు, జలంలోనూ, బయట వుండే ఉభయచరాలు, భూమిమీద వుండేవి, భూమిమీద, ఆకాశంలోను తిరిగేవి, కేవలం ఆకాశంమీద తిరిగే వారు అంటే దేవతలు… ఇలా ఎనిమిది దిక్కుల్లోను ఎనిమిది రకాల జీవాలను ఏర్పాటుచేశారు. ఈ ఎనిమిది రకాల జీవజాలానికి గురువు లుంటారు. రోజూ సాయంత్రం పూట భక్తి పాటలతో గురువును, భగవంతుడిని స్తుతిస్తూ పద్మంలోంచి నీళ్ళు స్వామివారికి అభిషేకం చేస్తాయి. దీని తయారీకి 25 కోట్లు ఖర్చయింది.

నేటి కార్యక్రమాలు
శనివారం వసంత పంచమి శుభవేళ విజయప్రాప్తికై విశ్వక్సేనేష్టి, విద్యాప్రాప్తికై హయగ్రేవేష్టి యాగశాలలో జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శనివారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement