Friday, November 22, 2024

మహిమాన్విత బీజాక్షరాలు

ఓం భూర్భువస్సవ: – తత్స వితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి – ధియో యోన: ప్రచోదయాత్‌
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములుకు నాయకత్వం వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్గేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియలను త్రికరణశుద్ధి గావించునదే గాయత్రీ మంత్రము. గాయత్రీ ఛందస్సులో ప్రతి పాదమునకు 8 అక్షరములు. ఇట్టి పాద ములు మూడు. ఈ త్రిలోక స్వరూపమే గాయ త్రి. మొదటి పాదము, భూమి, ఆకాశము, స్వర్గ లోకములివి. ఇవి ఎనిమిది అక్షరములు.
ఋగ్యజుసామ రూపమైన వేదత్రయము యొక్క నామాక్షరములు ఎనిమిది. గాయత్రి యొక్క రెండవ పాదము. ఈ రెండవ పాదము ను ఋగ్‌-యజు-సామ రూపమైన త్రయీ విద్య గా ఉపాసించవలెను.
ప్రాణమును, అపానమును, వ్యానమును, ఈ ప్రాణాపానవ్యానములను మూడు వాయు వులను ఎనిమిది అక్షరములు గల మూడవ పాద ము. ఈ ప్రాణ త్రయమే మూడవ పాదము.
తదుపరి ఈ ప్రత్యక్షమగు సూర్య మండల ము ‘పరోరజ’ అనునట్టి పదము ప్రకాశించునట్టి ది గాయత్రి యొక్క తురీయము అను దర్శిత పాదము. దర్శితం పదం అనునది కనబడుచు న్న ఈ మండలార్గత పురుషుడే. ఇంతకు ముం దు చెప్పిన ఈ మూడు పాద ములగల గాయత్రీ పరోరజసి యను దర్శిత పదములో సూర్య మండలాంతర్గత పురుషుడే స్థాన ముగా గల తురీయమునందు ప్రతిష్టితమైనది. ఆ ప్రసిద్ధమై న నాలుగవ పాదము సత్యము నందు ప్రతిష్టత మైనది. సత్యమైది యనగా నేత్రమే సత్యమైనది
శ్రీ గాయత్రీ దేవి – ఆమె వేదమాత, సర్వ ధర్మ సారము, శైవ, వైష్ణవ, సనాతన, ఆర్య సమా

జాది బేధములు లేకుండా అందరికీ ఆరాధ్య దేవత… మాత.
తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు. గాయత్రీ మంత్ర ప్రస్తావన మొదటిసారిగా ఋగ్వేదములో చెప్ప బడింది. గాయత్రి అనునది గయ మరియు త్రాయతి అను పదములతో గూడి ఉన్నది. గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ అని ఆది శంక రులు తమ భాష్యంలో వివరించారు. అనగా ప్రాణములను రక్షించునది గాయత్రి. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 అక్షరము లతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణ మును రచించినారు.
దసరాలలో నాలుగవ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితినాడు, అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి గా అలంకరిస్తారు. సకల మంత్రాలకూ మూల శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీ దేవి, ముక్తావిద్రుమహేమ నీల ధవళ కాంతుల తో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చు సంధ్యావందన అధిష్టాన శ్రీ గాయత్రీ దేవి. గాయత్రీదేవి మంత్ర ప్రభావము ఎంతో గొప్పది. గాయత్రీ మంత్రానికి ఋషి విశ్వామిత్ర మహర్షి. గాయత్రీదేవి మంత్రం రెండు విధాలు, ఒకటి లఘు గాయత్రీ మంత్రం, రెండవది బృహద్గా యత్రి మంత్రం.
ప్రతిరోజు సంధ్యా వందనం చేసి ఆ గాయత్రీ మంత్రాన్ని ధ్యానిస్తే, ఆ తల్లి అను గ్రహంతో పాటు-, వాక్సుద్ధి కలుగుతుంది. అంత టి మహత్తర శక్తి కలిగిన గాయత్రీదేవి శరన్న వరాత్రులలో ఐదు ముఖాలతో, వరదాభయ హస్తాలతో, కమలాసనగా దర్శనమిస్తుంది.
గాయత్రీ మంత్రములోని ప్రతి అక్షరము బీజాక్షరమే, మహిమాన్వతమే అని విజ్ఞుల భావ న. ఈ మంత్రం జపిస్తే సకల దేవలతను స్తుతించి నట్లే అని పెద్దలచే సూచింపబడినది. చతుర్విం సతి గాయత్రీ – గాయత్రీ మంత్రములో గల 24 అక్షరములతో పాటు- ఇరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతముగా నుండును. ఈ ఇరవై నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్విం శతి గాయత్రీ అని పేరు. ఈ ఇరవై నాలుగు దేవతా మూర్తులకు ఆధారమైన ఈ గాయత్రీ మంత్రా న్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

– రవికాంత్‌ తాతా
90005 24265

Advertisement

తాజా వార్తలు

Advertisement