Friday, November 22, 2024

మహేశ్వరుని మహాకాల స్వరూపము!

మహేశ్వరాత్మకమైన ప్రణవము నుండి ఈ విశ్వాంతరాళము ఆవిర్భవించినది. ఆ శబ్ద బ్రహ్మము నుండి సప్తర్షులు, సమస్త దేవగణములు ఉద్భవించినవి. ఇహపరముల హితము కొరకై పరమపదము ఏర్పడినది. కాలస్వరూపమే నా తాండవ రూపమని మహేశ్వరుడు అనేకసార్లు చెప్పియున్నాడు. వర్తులాకారముగా తిరుగుచున్న యుగములు మానవ మేథకు అందనివి. కృత, త్రేతా, ద్వాపర కలియుగములుగా వర్తించుచున్నవని బ్రహ్మపదమునకు యోగ్యత సంపాదించిన ఋషివర్యులు గుర్తించకలిగిరి. దేవతలతో సహా సమస్తమూ ఈ కాలమునకు వశులై ఉండవలసినదే. కాలమును కొలుచుట ఎవరికి సాధ్యము కాదు. అనగా కాలస్వరూపుని ఆద్యంతములు తెలుసుకొనలేనివి. ఋషులు, దేవతలు, ఇంద్రుడను వేయి దివ్య సంపూర్ణ దినములను వెచ్చించి మనస్సును సమాధి యుతము చేసి ఆ మహాదేవుని శరణు పొంది కాలము యొక్క రహస్యమును తెలుపగోరిరి.
అంత మహేశ్వరుడు ఈ విధముగా వివరించసాగాడు. కాలుడు నా అంశయే! నాలుగు ఆకారములు కలిగి, నాలుగు ముఖములతో ఎవరికి అంతు చిక్కక ఉండువాడు. ఈ కాలము అను స్వరూపమున నా ఆజ్ఞ లేకుండా ఎవరునూ తమతమ కర్మలను చేయజాలరు. కాలుడు నాకు తప్ప ఇంకెవరికీ భయపడడు. కాలుని జయించుట ఎవరికీ సాధ్యము కాదు. అంద రును ఈ కాలుని పదముల క్రింద నుండవలసినదే! శ్వేత వర్ణ ముఖము గల కాలునికి నాలు గు నాలుకలు కృతయుగములో ఏర్పడినవి. మూడు నాలుకలు కలిగి ఎర్రని కాంతిగల ముఖ ముతో త్రేతాయుగమున కనబడును. ఈ యుగమున మహేశ్వరుడు యజ్ఞ ప్రవృత్తి కలిగిం చును. అందువలన త్రేతాయుగమున యజ్ఞము శ్రేష్టము. మూడు నాలుకలు త్రేతాగ్నులై కాలజిహ్వగా కనబడును.
ఇక అతి భయానకమైన రెండు నాలుకలు కలిగి ఎరుపు, గోధుమ వర్ణము కలిగిన ముఖ ముతో రెండు పాదములతో ద్విపదము అనగా ద్వాపరయుగము వర్తించును. ఈ కాలమున కూడా యజ్ఞము, యాగము నాకు ప్రీతికరములే! ఇక కళ్లు నల్లనివిగా ఒకసారి, ఎర్రనివిగా ఒకసారి, ఒకే దీర్ఘనాలుక కలిగి విశాలమైన తమ పెదవులను మాటిమాటకి నాకుచూనున్న ముఖము కలిగి సర్వలోక భయంకరమై కలియుగము వర్తించును.
కృతయుగమున బ్రహ్మ పూజ్యుడు, త్రేతాయుగమున యజ్ఞము పూజ్యము. ద్వాపర మున యజ్ఞయాగాదులతో బాటు విష్ణువు పూజ్యుడు. నాలుగు యుగములలో నేను పూజ్యు డను. ఈ యుగచక్ర భ్రమణము మహేశ్వరుడనైన నేను త్రిప్పుచుండువాడను. బ్రహ్మ, విష్ణు వు, యజ్ఞము, యాగము నా యొక్క కళలే! నేను స్వయం జనితుడను. కాలస్వరూపము నా యందే కలదు. కాలమును ప్రవర్తింపచేయువాడను. నేను యుగములకు కర్తను. సర్వము నకూ పరుడను. నేను పరాత్పరుడను. ఈ నాలుగు యుగములలో కలియుగమును నాయం దు ఆసక్తి కలిగి ముక్తిని పొందుటకు దేవతలు మానవులు అను బేధము లేకుండా అందరికీ అవకాశము కల్పించి ఏర్పరచినాను. లోకహితమును చేకూర్చు కార్యము చేసి నా దివ్య కైలా స పథమును చేరుకొనుడు. కలియుగము అతి భయంకమైన కాలమగును. కాని భయ మును వీడి ఎవరైతే నా యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొని కాలమును సద్విని యోగము చేసెదరో వారు నా శివతత్త్వములో ఐక్యమగుదురు.
ఇక ఈ కాలస్వరూపుని బహుముఖ ఆకారమును వర్ణించెదను. నాలుగు ఆకారములు, నాలుగు కోరలు, నాలుగు ముఖములు కలవాడని చెప్పితిని. విశ్వ సంరక్షణ కొరకు అంత టనూ సంచరించుచుండును. చరాచరమైన ఈ ప్రపంచము ఇతని సాధ్యములో నుండును. కాలము భూతములను సృజించును. తిరిగి కాలస్వరూపుడే సంహరించును కాలమునకు వశులై సర్వమూ నడచుకొనవలసినదే! కాలము ఎవరి వశమూ ఎప్పటికీ కాదు. సర్వభూత ములను తమతమ కర్మలలో ప్రవర్తింపచేయువాడు కాలస్వరూపుడే! మన్వంతరము అను నామముతో కాలస్వరూపుడు ఆవర్తన కొనసాగించుచున్నాడు.
కలియుగమున బ్రహ్మజ్ఞానులు తమతమ విధులను పరమ పవిత్రముగా నొనరించిన మహాదేవుడనైన నా శరణు తప్పక లభించును. ఈ యుగమున దేవతలు, మానవులు, ఋషులు తమతమ పుణ్యఫలముతో స్వర్గమునకు చేరి మరలా భూమికి దిగి మరల మరలా అవతారములు, జన్మలు ధరింతురు. ఇది అంతయూ మహేశ్వరుడనైన నా వీక్షణలోనే జరుగుచుండును.
అందువలననే అతి ప్రతిబంధకమైన ఈ కలియుమున సర్వులూ ధర్మపరాయణులై ఉండుటకు సాధన చేయుచూ నా తపమును చేయుటకు విశ్వప్రయత్నము చేయుచుందురు. కాలాంతరమున ప్రస్థుత వైవస్వత మన్వంతరమున దేవర్షులు, రాజర్షులుగా చాలామంది అవతరించియున్నారు. పురువంశ రాజైన దేవాపి, ఇక్ష్వాకు వంశమున మనువు అవతరించి కాలాంతరమును చేరియున్నారు.
ఈ కలియుగము క్షీణింపగా తిరిగి కృతయుగమును కాలముగా స్వరూపమును పొం దును. మరల సప్తర్షులతో బాటు త్రేతాయుగము తప్పక వచ్చును. క్షత్రియ వంశములకు చెందినవారు తిరిగి కృతయుగమను కాలముగా స్వరూపమును పొందున. మరల సప్తర్షు లతో బాటు త్రేతాయుగము తప్పక వచ్చును. క్షత్రియ వంశములకు చెందినవారు తిరిగి రాగ లరు. త్రేతాయుగము తిరిగి ద్వాపరమవ్వగా ధర్మ సంస్థాపనానంతరము అది గడిచిపోయి తిరిగి కలియుగము సంభవించును. ఈ యుగమున కీర్తిమంతులు కాలస్వభావ ము, ప్రభావములచే సింహభాగము పాతకులై నరులుగా మిగిలి పోవుదురు. ఏడు మన్వంతరముల కాలమున బ్రహ్మలు, క్ష్రతియులు జనించుచుం దురు. ఇక స్త్రీ, పురుషులు కలి ప్రభావమున కొందరు భ్రష్టులగుదు రు. ఇక బ్రహ్మజ్ఞానముతో తప ప్రభావమున సత్యలోకమునకు బహుస్వల్పముగా చేరుచుందురు.
ఈ మహాకాలమున ఇక్ష్వాకులు, భోజులు, ప్రతివింధ్యు లు, హైహయులు, ధృతరాష్ట్రులు, జనమేజేయులు, బ్రహ్మద త్తులు, వీర్యవంతులు, పౌలులు, కాశీయులు, కుశవంశజులు, శశబిందువులు మొదలగువారు. యజ్ఞయాగాదులు చేసి స్వర్గ లోక మునకు వెళ్ళి వచ్చినవారే! ఇక యయాతి వంశజులు దుర్ల భమైన బ్రహ్మలోక సంబంధ వరములు పొందిన కీర్తివంతులు.
ఈ కలియుగమున కూడా ఎవరైతే నా శివతత్త్వమును జ్ఞాన ముతో గ్రహించి ధర్మబద్ధులగుదురో వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్త మునకు ముందు లభించు ఐదు వరములు లభించును. అవి ఆయువు, సంతానము, సంపదలు, కీర్తి ఈశ్వర ఐశ్వర్యభూతి అనునవి. ఈ పంచ బ్రహ్మవర్గ వరములను పొంది వాటిని లోకోపకారమునకు త్యజించిన వారు బ్రహ్మ లౌకికులై బ్రహ్మలోకమును పొందుదురని మహేశ్వరుడు దేవగణములకు విశదపరిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement