Friday, November 22, 2024

మహాలక్ష్మి ఆవిర్భవించిన రోజు…ఫాల్గుణ పూర్ణిమ

”లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్‌ బ్రహ్మంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం”

రెండు చేతులలో మాలలను ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరా జు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి™రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగ ళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ దేవి.
లక్ష్మి హందూ మత ప్రధాన దేవత. ఆమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితోపాటు ఆమె త్రిదేవతలలో ఒకరు. ఆమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టా లకు దేవతగా పరిగణించబడుతుంది.
మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, లక్ష్మీ నారాయ ణులు వేరు వేరు కాదని చెప్పబడింది.
సృష్ట్యాదిలో దేవి… సృష్టిని పాలించ డానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీ దేవిని ప్రసాదించిందని దేవీభాగవతంలో ఉంది. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడంతో విష్ణువు శక్తి హనుడయ్యాడు.
భృగు మహర్షి భార్య ఖ్యాతి. ఆమె పుత్రికా సంతానాన్ని తపస్సు చేస్తే ఆదిపరా శక్తి అంశతో ఆమె భార్గవిగా జన్మించింది. లక్ష్మీదేవి… స్వారోచిష మన్వంతరంలో- అగ్నినుంచి ఔత్తమ మన్వంతరంలో ”స్వ చ్ఛమైన గాలి నుంచి, తామస మన్వంతరం లో భూమి నుంచి, రైవత మన్వంతరంలో – బిల్వం నుంచి, చాక్షుష మన్వంతరంలో- సహస్ర దళ పద్మం నుంచి, వైవస్వత మన్వంతరంలో ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రంలో శుక్రవారం నాడు క్షీరసాగరం నుంచి ఉద్భవించిందంటారు. దూర్వాస మహాముని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాల సముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయ డం ప్రారంభించగా, పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది.
క్షీరసాగర కన్యగా లక్ష్మీ అవతరణం ఒక సంకేతార్థంగా భావిస్తారు. ఈ జగత్తు ఒక సాగ రం. మానవులలో సద్గుణాలు, దుర్గుణాలను… దేవదానవులుగా సంపద కోసం చేసే మథనమే క్షీరసాగర మథనం. క్షీరసాగరం అనేక సంపదలకు నిలయం. ఇలా మథనంలో హాలాహలం వంటివి చేదు అనుభవాలు. మరింత పట్టుదలతో, విశ్వాసంతో అధికంగా సాధన చేస్తే, భగవం తుడు శివరూపంలో అనుగ్రహంచి, సంపదలు సమకూరుస్తాడని, ఈ సంపదలను భగవ దర్పితంగా స్వీకరించాలని సందేశం అందిస్తుంది పురాణ కథనం.
ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్ర యుక్తంగానే లక్ష్మీనారాయణుల కల్యాణం జరిగిందని పండితులు చెబుతారు. శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జననం ఉత్తరా నక్షత్రంలో జరిగిందని వాల్మీకి రామాయణం చెబుతుండగా, ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ఉత్తర నక్షత్ర ద్వితీయ పాదం లోనే జరిగిందని కొందరు పండితుల ఉవాచ.
శ్రీలక్ష్మి కారుణ్య రూపిణి. మంగళకరమైనవి, ప్రకాశనీయమైనవి ఘనమైనవి, పవిత్ర మైనవి, అదృష్టమైనవి అయిన పదార్ధాలన్నీ ఆ తల్లి కటాక్షం ప్రసరించడం వల్లనే ఏర్పడ్డాయని విశ్వసిస్తారు. విష్ణువు అవతారాలతోపాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుంది. లక్ష్మిని పలురకాలు గా పలు రూపాల్లో ఆరాధిస్తున్నారు. ఆమె రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, ధనలక్ష్మి వంటి రూపాల్లో పూజలు అందుకుంటూ ఉండగా, అష్టోత్తర శతనామ స్తోత్రం , స#హస్ర నామ స్తోత్రం వంటివి పఠిస్తే భక్తులకు ప్రసన్నురాలు అవుతున్నదని పండితులు చెపుతారు. ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి… ఇలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement