Friday, November 22, 2024

మహాకాళేశ్వర జ్యోతిర్లింగము (ఉజ్జయిని, మధ్యప్రదేశ్)

 శ్లో॥ అవంతికాయాం విహితావతారం

 ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |

 అకాల మృత్యోః పరిరక్షణార్థం

 వందే మహాకాల మహాసురేశమ్ ||

- Advertisement -

 భావము: అకాల మృత్యువు నుండి రక్షించి సజ్జనులకు ముక్తినిచ్చుటకు అవంతీ నగరము (ఉజ్జయిని)లో అవతరించిన మహాకాలుడను పేరు గల దేవదేవునకు నమస్కరిస్తున్నాను. (ఇక్కడి అమ్మవారు మహాకాళి.) ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి -సతీదేవి మోచేయిపడిన చోటు)

 పురాణగాధ: మాళవ దేశంలోని అవంతీ (నేటి ఉజ్జయిని) నగరం శిప్రా నది ఒడ్డున వుంది. భారతదేశంలోని మోక్షదాయకములైన ఏడు నగరాలలో ఈ అవంతీనగరం ఒకటి.

 “అయోధ్యా మధురా మాయా కాశీ కాంచే అవంతికా |

 పురీ ద్వారావతీ చైవ సప్లైతే మోక్షదాయకాః ॥

 అనే పురాణ వచనం వలన ఈ అవంతిక నగరం మోక్షదాయకమని తెలుస్తుంది. స్కాంద పురాణంలోని అవంతీ ఖండం ఈ నగరం గొప్పదనాన్ని యెంతగానో వివరిం చింది. శివపురాణంలోను, మహాభారతంలోను ఈ అవంతీ (ఉజ్జయినీ) నగర మహిమ యెంతగానో వివరింపబడింది. ఇక్కడి శిప్రా (క్షిప్రా) నదీస్నానం అన్ని పాపాలనూ నశింపజేస్తుందనీ అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాలలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు సాందీపని వద్ద చదువుకున్నారని భాగవతం చెస్తోంది. ఆ సాందీపుని ఆశ్రమంలో ఈ నగరంలో శిపా నది ఒడ్డున వుంది. చరిత్ర ప్రసిద్ధిగన్న విక్రమాదిత్య మహారాజు ఈ ఉజ్జయినీ నగరాన్ని రాజధానిగా జేసుకొని పరిపాలించాడు. ఇతని సోదరుడు ‘భట్టి’ మంత్రిగా, మరొక సోదరుడు భర్తృహరి విరాగియైన మహా పండితుడుగా, కాళిదాసాది మహాకవులు అతని ఆస్థాన నవరత్నాలుగా చరిత్ర ప్రసిద్ధము ఈ భట్టివిక్రమార్కుల చరిత్రకథలుగా దేశమంతా చెప్పుకొంటూ వుంటారు. ఈ నగరానికి గల ప్రసిద్ధి అది.

 విక్రమాదిత్యుని కాలంలో వరాహమిహిరాద్ జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఆ అభివృద్ధి చేశారు. గ్రహాది నభోరాసులు పరిశీలనకనువుగా ఒక నక్షత్రశాలనే శాస్త్రాన్నెంతో ఉజ్జయినిలో నిర్మించేరు. భారతీయ జ్యోతి క్యాస్త్రమున కాయువు పట్టిన ‘దేశాంతర శూన్యరేఖ’ ఉజ్జయిని నుండే ప్రారంభమైనది. జ్యోతిశ్శాస్త్రంలో సున్నా డిగ్రీగా పరిగణించేది ఆ ఉజ్జాయిని – లంకారేలయే,

 ఉజ్జయినీ నగరనివాసము శిప్రా (క్షిసా/చ్చిప్రా) నదీస్నానము, మహాకాళేశ్వర ధ్యానము / దర్శనము, అక్కడ మరణించుట సర్వపాపహరమనీ, అష్టైశ్వర్యప్రదమనీ, మోక్షప్రదమనీ స్కాందపురాణము అవంతికా ఖండము 26వ అధ్యాయం 17, 18, 19 శ్లోకములలో వివరింపబడింది. ఇక పౌరాణిక గాధ –

 ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో వేదవేదాంగవేత్త, నిత్యపార్ధివ శ్రీలింగ పూజా తత్పరుడు అయిన ‘వేదప్రియుడు’ అను బ్రాహ్మణుడు నివసిస్తూ వుండేవాడు – అతనికి ష‌దేవ ప్రియుడు, సుమేదసుడు, సుకృతుడు, ధర్మవాహుడు’ అను నలుగురు కుమారులు కలిగారు. వారి సుగుణముల వలన ఉజ్జయినీ నగరమే బ్రహ్మతేజముతో కళకళ లాడింది.

 అయితే, ఉజ్జయినికి దగ్గరలో నున్న ‘రత్నమాలా’ అనే పర్వతమున ‘దూషణుడు’ అనే రాక్షసుడుండేవాడు. అతడు తపస్సుచేసి బ్రహ్మ నుండి వరములను పొందేడు. ఆ వర గర్వముతో దేవతలను ఓడించి పారద్రోలాడు. దౌర్జన్యంతో యజ్ఞాది క్రతువులను చేసేవారిని హింసించి యజ్ఞధ్వంసం చేసేవాడు. ప్రజలు వేదోక్త ధర్మాలను వదలి పెట్టారు. పుణ్యతీర్ధములు నిస్సారములయ్యాయి. కాని ఉజ్జయిని (అవంతి కానగరం)లో మాత్రం వైదిక ధర్మము చెడిపోలేదు. సిరిసంపదలతో కళకళలాడేది. దానిని ఆ రాక్షసుడు చూచి సహించలేకపోయాడు. దేవతలు, రాజాధిరాజులు నా ఆజ్ఞలను తల దాల్చుచుండగా ఈ ఉజ్జయిని లోని వారు పాటించడం లేదు. వారిని శిక్షించవలసినదే. వేద ధర్మమును, పూజలను విడిచిపెట్టి నా శరణుకోరిన సరే లేకపోతే ఉజ్జయిని వాసుల జీవితములు ముగిసినట్లే అని వారికి చెప్పిరండని నల్గురు మంత్రులను పంపించాడు. వారు ఉజ్జయినికి వెళ్ళి ప్రజలకు, వేదప్రియుని నలుగురు కొడుకులకు దూషణుని మాటలు చెప్పారు. కాని వారు దూషణుని మాటలను లెక్కచేయలేదు. భయపడలేదు..

 దూషణుడు నగరమును దండెత్తకమానడని తలచిన ఉజ్జయిని నగరములోని బ్రాహ్మణులు, వేదప్రియుని కొడుకులు ప్రజలకు ధైర్యము చెప్పి, తాము పార్ధివ శివ లింగమును నిర్మించి యధాశాస్త్రముగా, ఏకాగ్ర చిత్తులై శివపూజ చేస్తున్నారు. ఆ ధూషణాసురుడు తన సైన్యముతో వచ్చి వారిని చంపుడని తన సైనికులను ఆజ్ఞాపించాడు. తానును బ్రహ్మహత్యకు తలపడి కత్తి చేతబట్టి వచ్చాడు. బ్రాహ్మణులను బాధపెడు తున్నాడు. అయినా వారు దీక్ష వదలక శివుని పూజిస్తూనే ఉన్నారు.

ఆ సమయమున పార్ధివ శివలింగ ప్రతిష్ట జరిగిన చోటున భయంకరముగు శబ్దముతో పెద్ద అఖాతము (గొయ్యి) యేర్పడింది. దానిలో నుండి మహేశ్వరుడుద్భవించి. “ఓరీ దూషణా! నీవంటి దురాత్ములను, సాధుహింసకులను నశింపజేయడానికే మహా కాళరూపుడనై వచ్చాను” అని చెప్పి ఒక్క హుంకారముతో ఆ దూషణాసురుని, అతని సేనలను సంహరించాడు. చావగా మిగిలినవారు పారిపోయారు. శివ సాక్షాత్కారము వేలన రాక్షసుల బాధలు పశమించాయి. దేవతలు పుష్పవర్షము కురిపించారు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాదిదేవతలు వచ్చి మహా కాళేశ్వరుని పూజించారు. బ్రాహ్మణులు న‌మ‌స్క‌రించారు. అపుడు శివుడు వరము కోరుకోమన్నాడు. అప్పుడు వారు ‘మహా కాళేశ్వరా ! నీవు ఈ’ స్థలమున జ్యోతిర్లింగముగా వెలసి భక్తుల అభీష్టములను తీర్చుచు, వారికి మోక్షమును ప్రసాదింపుచుండుము’ అని కోరారు.

 ఇట్లు పరమేశ్వరుడు ఉజ్జయినిలో మహా కాలేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగమై వెలసి భక్తుల కోరికలను తీరుస్తూ, చిత్తశుద్ధిని, ముక్తిని ప్రసాదిస్తున్నాడు. సూతుని వలన పై గాధను వినిన సౌనకాది మునులు మహాకాళేశ్వరు నారాధించిన భక్తుల చరిత్ర చెప్పుమని అడిగారు. దానికి సూతుడిట్లు చెప్పుచున్నాడు. “ఒకప్పుడు ఈ ఉజ్జయినీ నగరాన్ని మహా శివభక్తుడైన ‘చంద్రసేనుడు’ అనే రాజు పరిపాలించేవాడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నుడైయున్న సమయంలో శ్రీకరుడు అనే అయిదేండ్ల గోపబాలకుడు తన తల్లితో అక్కడికి వచ్చి రాజు చేస్తున్న పూజను చూశాడు. తను కూడా అలాగే శివుని పూజించాలనుకొని ఆ బాలుడు తిరిగి వచ్చుచు.. దారిలో దొరికిన ఒక గులకరాయిని తీసికొచ్చి దానినే శివలింగముగా భావించి దానికి అభిషేకం, చందన పుష్పాదులతో పూజను అతిశ్రద్ధగా చేస్తూండే వాడు. ఒకనాడా బాలుడు ధ్యానములో బాహ్య స్మృతిలేనంతగానుండగా అతని తల్లి భోజనమునకు రమ్మని చాలాసార్లు పిలిచి, చివరకు విసిగిపోయి శివలింగమును, పూజాద్రవ్యాలను తీసిపారవేసి బాలుని బలవంతముగా భోజనమును తీసుకెళ్ళ బోయింది. కాని ఆ బాలుడు విలపిస్తూ శంభో! మహాదేవ అని ఎలుగెత్తి పిలవ సాగాడు. తల్లి చేయునది లేక ఇంటికి పోయింది. బాలుడట్లు ఆక్రందనము చేస్తూ మూర్ఛపోయాడు. శివుడు కరుణించి ఆ బాలుని పునర్జీవితుడిని చేశాడు. బాలుడు కనులు తెరిచేసరికి ఒక దివ్యమందిరము, అందు జ్యోతిర్లింగము కనపడగా బాలుడు మరింత సంతోషంతో శివుని స్తుతించాడు. తిరిగి బాలునికై వచ్చిన అతని తల్లి జరిగినదంతయు కనులారా చూచినదై బిడ్డడి నెత్తుకొని మైమరచింది. రాజైన చంద్ర సేనుడికి విషయము తెలిసి వెంటనే వచ్చి బాలుని కొనియాడేడు. ఆ సమయమున అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమై అక్కడ చేరిన భక్తులందరితో ‘భక్తులారా! ఈ ప్రపంచమున పరమశివుని మించిన పరతత్వము ఇంకొకటి లేదు. మహర్షులు సంవత్సరములు తపస్సు చేసినా పొందలేని మహా ఫలమును ఈ బాలకుడు పొందేడు. ఇది ఆ దయామయుని కృపాఫలమే. మీరును ఈ భగవద్దర్శన పూజాదులతో బాలకుని వంశమున ఇతనికి యెనిమిదవ తరము వాడుగా శ్రీకరుడను బాలకుడే నందగోపుడను పేరును తిరిగి పుడతాడు. ఆతని వాత్సల్యము . ప్రేమలను పొందుటకు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి నానావిధ లీలలతో భక్తులనాడుకొంటాడు’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తర్వాత చాలాకాలం చంద్రసేన, గోపాలకులు శ్రీ మహాకాలుని పూజిస్తూ ముక్తిని పొందేరు” అని సూతుడు చెప్పేదు.

చరిత్ర: చైనా యాత్రికుడు ‘హుయాన్ త్సాంగ్’ రచనలలోను, బాణుని కాదంబరి లోను, శూద్రకుని మృచ్ఛకటిక నాటకంలోను, కథా సరిత్సాగరంలోనూ, కాళిదాసుని కావ్యాల లోను, ఇంకా మరెన్నో సంస్కృత గ్రంథాలలో ఉజ్జయిని వైభవం వర్ణితమై వుంది. విక్రమాదిత్యుడనే బిరుదును పొందిన చంద్రగుప్తుని తర్వాత మౌర్యులు, తర్వాత శుంగ వంశపు రాజులు, తర్వాత గుప్త వంశపురాజులు పరిపాలించారు. వారి తర్వాత హూణులు వారి తర్వాత 19వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు) పరమార్ రాజులు పాలించారు. వీరి పాలనలో రాజధానిగా, సాహితీ కళా సంస్కృతులు అత్యంతాదరణ పొందినది. వీరిలో భోజరాజు చిరస్మరణీయుడు. వీరిలో చివరి వాడు శిలాదిత్యుడు. ఇతని తర్వాత ముస్లిలు (సుల్తానులు) తర్వాత మొగలాయీలు పాలించారు. 12-16 శతాబ్దాలమధ్య ఉజ్యయిని అనేక దాడులకు దోపిడీలకు నిలయమైంది. – సుల్తానుల పాలనలో దోపిడీ పరాకాష్టకు చేరి నిత్యపూజా వైభవాలంతరించి పోయాయి. 1650లో రాజా సవాయిసింగ్ గవర్నర్ గా నియమింప ‘బడినాక’ అతడు శిధిలమైన దేవాలయాలను, నక్షత్రవేదశాలను పునరుద్ధరించాడు. 17వ శతాబ్ద ప్రారంభంలో మరాఠీల ఆధిపత్యంలోకి వచ్చింది. వీరు ఆలయాలను పునరుద్ధరించడమే కాక యెన్నో దేవాలయాలను నిర్మింపజేశారు. బహుముఖి కళా కేంద్రంగా తీర్చిదిద్దారు. మరాఠీల తర్వాత సింధియాల పాలనలోకి వచ్చింది. 1809 వరకు రాజధానిగా నుండిన ఉజ్యయిని నుండి 1810లో దౌలర్రావు సింధియా రాజధానిని గ్వాలియర్కు మార్చాడు. ఆ తర్వాత సింధియాల నుండి బ్రిటీష్ వారి ఆధిపత్యంలోకి, స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వాధీనంలోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement