Friday, November 22, 2024

కొవిడ్‌ నిబంధనలతోమహాజాతర

వేములవాడ, ప్రభన్యూస్‌: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సోమవారం రోజున శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సుమారు 2లక్షల మంది జాతరలో పాల్గొనేందుకు వేములవాడ చేరుకున్నారు. మహా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. చలువ పందిళ్ళు, వైద్య సేవలు, ఉచిత అన్నదానం, కట్టు-దిట్టమైన భద్రత, భక్తులకు మరింత భక్తిభావం పెంపొందించేందుకు పార్కింగ్‌ స్థలంలో ఏర్పాటు- చేసిన శివార్చన తదితర కార్యక్రమాలను ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం ముందుకు తీసుకెళుతోంది.
మహా జాతరలో ముఖ్య ఘట్టం లింగోద్భవం
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో మూడు రోజుల పాటు- జరిగే మహా జాతర వేడుకలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి మహోత్స వ వేడుకల్లో భాగంగా మంగళవారం రోజున లింగోద్భవ కార్యక్రమాన్ని ఆలయ అర్చక బృందం ఘనంగా నిర్వ హిస్తారు. శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప్రభుత్వం తర
పున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement