Saturday, November 23, 2024

మహా శివరాత్రి వైశిష్ట్యం

శివుడు విశ్వమంతా వ్యాపించినవాడు. శివ అనే రెండక్షరాలు అత్యంత మహిమాన్వితమైనవి. శివ అంటే మంగళకరమని అర్ధం. మంగళ కరుడైన పరమ శివుని అనుగ్రహం పొందడానికి హిందు వులు జరుపుకునే ముఖ్య మైన పండుగ మహాశివరాత్రి.
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. రూపరహితుడైన శివుడు జ్యోతిరూపంలో, లింగాకారంగా ఆవిర్భవించిన సమ యం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అని కూడా అంటా రు. పరమేశ్వరుడి 64 స్వరూపాల్లో లింగోద్భవమూర్తి అత్యం త మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి.
శివరాత్రి వ్రతం
మనసా వాచా శివుని ఆరాధించే వ్రతమే శివరాత్రి వ్రతం. శివరాత్రి గురించి పార్వతీమాత ఓసారి పరమేశ్వరుడిని అడిగినప్పుడు.. శివరాత్రి అంటే తనకెంతో ఇష్టమని.. ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసమున్నా సరే సంతోషిస్తానని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి రోజున పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నేయి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగు తుంది. మరుసటి రోజు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తిచేయాలి. దీనిని మిం చిన వ్రతం మరొకటి లేదని పరమశివుడే స్వయం గా పార్వతి దేవికి చెప్పాడు. అలాగే ఈరోజున తనను లింగాత్మకంగా ఆరా ధించిన వారెవరైనా సరై పురుషోత్తముడవుతాడని, ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టమని, అలా చేసినవారు కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు స్వయంగా చెప్పాడు. అంతట పార్వతిమాతే స్వయం గా శివరాత్రి వ్రతాన్ని పాటించి శివానుగ్రహం పొందిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
ఎలా జరుపుకోవాలి?
శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజామందిరాన్ని ముగ్గులు, పుష్పా లతో అలంకరించుకోవాలి. తెల్లని బట్టలను ధరించి, మారేడు దళాలతో యథాశక్తి శివపూజ చేసి పొంగలి, బూరెలు, గారె లు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజంతా శివనామ స్మరణతో ఉపవాసము ండాలి. విశేషమైన లింగోద్భవకాలంలో నిర్గుణ, నిరాకారు డైన పరమేశ్వరుడిని పంచాక్షరీ మంత్రంతో కొలుస్తూ, మొదటి జాములో పాలతో, రెండవజాములో పెరుగుతో, మూడవ జాములో నెయ్యితో, నాల్గవ జామున తేనెతోను అభి షేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అయితే ఈ రోజున ఉపవాసం, జాగరణ అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఫలప్రదమైనవిగా పురాణాలు చెబుతున్నాయి.
శివరాత్రి రోజున ఎర్రని ప్రమిదల్లో దీపారాధన చేయాలి. దీపారాధనకు నువ్వులనూనె వాడటంతోబాటు ప్రమిదలో ఐదు వత్తులు వేసి పంచహారతి ఇవ్వడం శ్రేయస్కరం. మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివనామ స్మర ణ చేసి ఉదయాన స్నానం చేసి శివపూజ చేసి ఉపవాసాన్ని విర మించాలి. అయితే శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది. ఏ వ్యక్తి అయితే శివరాత్రి రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసా దిస్తాడు. వ్రతంచేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటి వెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతంలో జీవన్ముక్తులౌతారని స్కాంద పురాణం చెబుతోంది. తనకు ఏ పూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వలన ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో చెప్పాడు. శివపూజలో సాయుజ్య ము, శివభజనలో సామీప్యము, శివధ్యాన ములో సారూప్యము సిద్ధిస్తాయని జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు.

– దాసరి దుర్గాప్రసాద్‌
7794096169

Advertisement

తాజా వార్తలు

Advertisement