Saturday, November 23, 2024

విశాఖలో కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం

ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ సాగరతీరంలో మంగళ వారం మహా శివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా డాక్టర్‌ఒ టి.సుబ్బరామిరెడ్డి సేవా పీఠం ఆధ్వర్యంలో కోటి శివలింగాలకు మహాకుంభా బిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి.సుబ్బ రామి రెడ్డితో పాటు విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూ పానం దేంద్ర, స్వాత్మానందేంద్రలు హాజరై కోటి శివలింగాలకు అభి షేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ టి.సుబ్బరా మిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా 37వ మహాకుంభాబిషేకం నిర్వహించామన్నారు. శివరాత్రి పర్వదినం రోజున విశాఖ సాగరతీరంలో పరమశి వుడిని ఆరాధించడం వల్ల తనకు ఎంతో అనుభూతి కలుగు తుందన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మా నందేంద్రలు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన సినిమాలు, సికార్లు కంటే పరమశివుని ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతీ ఒక్కరూ శివరాత్రి రోజు శివుడిని ఆరాధించాలన్నారు. ఎవరైతే శివరాత్రి పర్వదినాన శివారాధన చేస్తారో వారు శివసాన్నిధ్యాన్ని పొందవచ్చునన్నారు. ప్రతీ ఏటా మహాకుంభాబిషేకం నిర్వ హించిన సుబ్బరామిరెడ్డిని స్వామీజీలు అభినందించారు. ఈ సందర్భంగా టిఎస్‌ఆర్‌ సేవలను పీఠాధిపతులు కొనియా డారు. తొలుత శివలింగాలకు పంచామృతం, సుగంధ ద్రవ్యా లు, పళ్ల రసాలుతో కోటి 8 లక్షల శివలింగాలకు మహాకుం భాబిషేకం నిర్వహించారు. సుబ్బరామిరెడ్డి స్వయంగా భక్తులచే అభిషేకం చేయించారు. అనంతరం భక్తులందరికి రుద్రాక్షలు, పసుపుతాళ్లు అందజేశారు.
కేరళ రిటైర్డ్‌ డీజీపీకి స్వరూపానందేంద్ర ఆశీస్సులు
కేరళ రాష్ట్ర రి-టైర్డ్‌ డీజీపీ రాజేష్‌ దివాన్‌ మంగళవారం విశాఖలో పర్యటించారు. సతీసమేతంగా ఆయన విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యా మల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చా రు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మా నందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకు న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement