Sunday, November 17, 2024

మది నిండా మహాదేవుడు

మది నిండా ‘మహాదేవ శంభో శంకర’ అని శివ మహాదేవుని నింపు కోవడమే అనిర్వచనీయ ఆనందం. ‘శివను గ్రహేణ జ్ఞాన ప్రాప్తి:’ అన్నారు. శివుని అనుగ్రహం కల్గితే చాలు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. శివనామం గంగానది. విభూతి యమున. రుద్రా క్ష, సరస్వతి, త్రివేణిసంగమ తత్వం అని సాక్షాత్‌ బ్రహ్మదేవుడు అన్నా డు. అందుకే శివ అంటే పరమేశ్వరుడు శివా అంటే పార్వతి. శివశివా అంటే చాలు జీవితం జీవనం ధన్యమవు తుంది. ఆది అంతములేని పరమాత్మ లోక కళ్యాణం కోసం మాఘ చతు ర్దశి నాడు అర్ధరాత్రి లింగ రూపమున వెలిశాడు. ఇదే మనమంతా మహా శివరాత్రిగా భావించి అర్ధరాత్రి సమయాన ఏకాదశ ద్రవ్యాలతో కూడి నమక చమక పారాయణంతో అభిషేకార్చన నిర్వహించే సంప్రదా యం. మహాదేవుని విభూతి ధరించని లలాటం ఈశ్వరార్చన చేయని జన్మం. శివాలయం లేని ఊరు నింద్యములు నిష్ప్రయోజనము అని జాబోలినోపనిషత్తు తెలియజేస్తుంది. విభూతి ధారణ జ్ఞానైశ్వర్యానికి నిదర్శనం. ఈ దృశ్యమాన జగతిలో ప్రతి వస్తువు ఏనాటికైనా స్మశా నంలో బూడిదే అని శివుడు మనకు తెలుపుతున్నాడు.
విశ్వమంతా పంచుకుని ఉండే శుద్దచైతన్య పరతత్వమే శివం.
అఖండమైన ఈ పరమ శివతత్వం పంచభూతాలుగా విడిపడు తోంది. పంచభూతాలతో నిర్మాణమైన ప్రకృతిగా భాసిల్లుతోంది. అనేక ప్రాణులుగా బయటకు వ్యక్తమవుతోం ది. అంటే విడిగా చూస్తే అనేకంగా కనబ డుతోంది. వివరంగా చూడగల్గితే అది ఏకాకృతిగా తెలుస్తోంది. అనంత కోటి ప్రాణులను తనలో ఇము డ్చుకోవ డాని కి వెలిసిన ఈ చైతన్య తేజో స్వరూపాన్ని ఇలా అని ఊహించడానికే ఎవరికి సాధ్యంకాదు. బ్రహ్మ, విష్ణువులే తుది మొదల్ని తెలుసుకోలేకపోయారే, చివరకు ‘నమ స్సకల నాధాయ నమోస్తు సకలాత్మనే” అని అగ్ని లింగానికి భక్తితో సాగిలపడ్డా రు. అపరిమితమైన ఇటువంటి భక్తి విష యాలకే పట్టుబడే అమూర్త భావనా కారమిది. వర్ణించడానికి స్తుతించడానికి మాటలు చాలవు. ఏ భావనా సరిపోదు. కనకనే సాక్షాత్తు శివుడే హరి బ్రహ్మాదు లకు తన తత్వాన్ని తెలియజెప్పాడు. ఈ వాక్కులే ఈశ్వ రాగమములై రూపు దిద్దుకున్నాయి. వాటి నుండి వచ్చిన పురాణాలు ఇతిహాసములు శివ మహిమను లీలా వైభవాన్ని విశేషంగా వర్ణించాయి
సర్వ మంగళ స్వరూపం శివం
సర్వ గ్రహ పీడనలను నిరోధించి శుభాలనిచ్చే పరమ శివుడి స్వరూపం చూసిన వారి జన్మను పావనం చేస్తుంది. వేయి సింహాల రథంపై ఊరేగిన పార్వతీ వైభవం భారతంలోని అరణ్య పర్వం అద్భుతంగా వర్ణించినది.
పంచాక్షరీ వైభవం
‘ఓం నమశ్శివాయ’ లౌకిక బంధాల మాయలో చిక్కుకుని విల విలలాడుతున్న మనిషిని ఆ మాయ నుంచి విడిపించే తారక మంత్రం ఓం నమశ్శివాయ. ఆత్మను పరమాత్మ వైపు చేర్చే రాజహంస ఈ మంత్రం. నమశ్శివాయ అంటే శివునకు నమస్కారం అని అర్థం. శివ అంటే పవిత్రుడు అనే అర్థం. ఈ అర్థాన్ని ఆధారంగా తీసుకుంటే నమ శ్శివాయ అంటే పవిత్రతకు నమస్కారం. లేదా పవిత్రతకు నమస్కరి స్తున్నాను’ అని అర్ధం ఏర్పడుతుంది. మరొక కోణంలో ఆలోచిస్తే ఏ చైతన్యమైతే విశ్వవ్యాపితమై ఉంటుందో ఏ చైతన్యం సమస్త ప్రపంచా న్ని తనలో లయం చేసుకుంటుందో ఆ చైతన్యం యొక్క పేరు శివ . ఆ రూపం శివస్వరూపం.
సర్వ జీవాత్మల్లో సకల విశ్వంలో నిండి ఉండే చైతన్య స్వరూపుడైన శివునకు నమస్కారం. అని పంచాక్షరీ మంత్రానికి అర్థం చెప్పుకోవచ్చు. పంచాక్షరీలో నకారం బ్రహ్మను, మకారం విష్ణువును శికా రం రుద్రుడిని వకారం మహేశ్వరుడిని యకారం సదాశివుని సూచిస్తాయి. ఈవిధంగా చూస్తే పంచాక్షరీ మంత్రం శివ కేశవ అభేదాత్మకమైన అద్వైత భావనకు ప్రతీకగా నిలుస్తుంది.
అనంతమైన విశ్వాన్ని పరమేశ్వరుడు తన ఐదు ముఖాలతో ఏవిధంగా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ తానై నిండి ఉంటాడో ఆ అయి దు ముఖాల సంకేతాక్షరాలతో ఏర్పడిన శివ పంచాక్షరి ఉపాసన చేస్తే అనంతమైన శివతత్వాన్ని ఉపాసన చేసినట్లే అవుతుంది.
నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంలో నమ: అనే పదం జీవాత్మని, శివ అనే పదం పరమాత్మను సూచిస్తాయి. అయ అనే పదానికి ఐక్యం చెందడం అనే అర్థం ఉంది. మదినిండా మహదేవుని స్మరిస్తూ మహా శివరాత్రి పర్వ దినా న్ని గడుపుతాం. శివానుగ్రహానికి పాత్రులవుదాం.


– డాక్టర్‌ మాచిరాజు వేణుగోపాల్‌,8008004596

Advertisement

తాజా వార్తలు

Advertisement