మానవ చరిత్రలో తమకు దక్కిన తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి పంచి మార్గదర్శులుగా మారారు. అట్టివారిలో భారతదేశంలో ప్రముఖంగా ముగ్గురు ఆచార్యులు ఉన్నారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మూడవవారు ఆఖరి ఆచార్యులు మధ్వాచార్యులు. వారు ప్రతిపాదించినదే ద్వైత సిద్ధాంతం. హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారం మధ్వాచార్యులు.
మధ్వాచార్యులు ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి, ద్వైతమత విస్తృత ప్రచారం గావించి, వైష్ణవ మత వ్యాప్తికి, ప్రధానంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ద్వారా ఇతోధికంగా కృషి సల్పారు. మధ్వా చార్య ద్వైతమత బోధకులు. ఆయన సాంప్రదాయాలను పాటించే వారిని మాధ్యులు లేదా మధ్వ మతస్తులు అంటా రు. క్రీ.శ.1238 ఆశ్వయుజ మాస శుక్ల పక్ష దశమి (విజయ దశమి) నాడు ఆయన కొంకణ కేరళ మధ్యనున్న కనరా మండలంలోని ఉడిపి పట్టణ సమీప స్థపాజక క్షేత్రంలో మధ్య గేహభట్ట, వేదవతి దంపతులకు జన్మించారు. ఉడిపి లోని అనంతేశ్వరస్వామిని చిరకాలం కొలిచిన ఫలితంగా జన్మించినందున ఆయనకు వాసుదేవుడని తల్లిదండ్రులు పేరు పెట్టారు. అనంతర కాలంలో ”పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్య” అనే నామాలతో ప్రసిద్ధులైనారు. 8వ ఏట ఉపనయన సంస్కారియై, 10 ఏళ్లకే సర్వ విద్యాపారంగతుడైనారు. 11ఏళ్ల వయసులో సన్యాసం వైపు ఆకర్షితులై, అచ్యుత ప్రజ్ఞ అనే యతివర్యులైన ఆధ్యా త్మిక గురువు వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, ”పూర్ణ బోధ”లో నంది అనే గొప్ప పండితుని ఓడించి ”మధ్వ, పూర్ణ ప్రజ్ఞుడు” బిరుదులు పొందారు. వేదాంత విద్యా రాజ్య పట్టాన్ని పొంది ”ఆనంద తీర్థులు నామాంచితులై నారు. యుక్త వయసులోనే దక్షిణ భారతావనిలో కన్యా కుమారి, రామేశ్వరం, శ్రీరంగం తదితర క్షేత్రాలను సంద ర్శించారు. తాము పొందిన తత్వజ్ఞానాన్ని ఉపన్యాస రూపంలో ప్రజలకు వివరించారు. శ్రీశంకర భగవత్పాదుల ప్రస్థాన త్రయానికి ఒనర్చిన భాష్యాలను మధ్వాచార్య విమర్శించారు. దక్షిణ దిగ్విజయ యాత్ర గావిస్తూ, తమ ముఖ్య శిష్యుడైన సత్యతీర్ధులతో కలిసి బదరి యాత్ర చేశారు. ఆ సందర్భంలోనే బ్రహ్మ సూత్రాలపై భాష్యాలను పూర్తి చేశారు. స్వదేశానికి తిరిగి వస్తూ రాజమహేంద్రవరంలో శ్యామశాస్త్రి (నరహరి తీర్థులు)ని మాయావాదం గురించి ఓడించి, ప్రచండవాదం గావించి, శిష్యుడిని చేసుకున్నారు. అలాగే అక్కడే శోభనభట్టు (పద్మనాభ తీర్థులు) అనే పండి తుడు శిష్యుడైనాడు. ఉడిపిలో భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యాలు రాసారు. రుగ్వేదంలోని 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానాలు రచించారు. తర్కంతో పాటు 37 గ్రంథాలను విరచించారు. జీవిత కాలంలో ఆనందాను భూతి పొందగల సులభతరమైన భక్తిమార్గాన్ని ఆయన బోధించారు. అందుకే ఆయనకు ఆనంద తీర్థులన్న నామ ధేయం బహుళ ప్రచారంలో ఉంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పాటు కర్తవ్య కర్మ ఆచరణ ద్వారా శ్రీచరణాలు చేరవచ్చు నని మార్గదర్శనం చేశారు. జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్యకాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం. భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపుర స్కృతమైన భక్తి అయి ఉండాలి.
భీమసేనుని అవతారమని భావించే మధ్వాచార్యులు వృకోదరత్వాన్ని పలుమార్లు ప్రదర్శించి, విష్ణు మంగళ గ్రామాన 200 అరటి పళ్ళను ఆరగింప ప్రార్ధితులై అలవోక గా తినివేశారు. ఇషుపాతమనే మరో గ్రామంలో 1000 అరటి పళ్ళు తెచ్చి ఇవ్వగా, అన్నింటినీ ఒకే ఊపులో ఆర గించారు. ఒకసారి అడవి మార్గాన సంచరిస్తుండగా, పొద ల నుండి వచ్చి, శిష్యుని మీద దూకిన పులిని ఒకే గుద్దుతో హతమార్చారు. కడూరా మండలంలోని ముద్ర గ్రామ సమీప తుంగ భద్రా నదీ తీరాన అంబు తీర్ధమనే ప్రదేశాన ఒడ్డునుండి నది లోనికి అడ్డంగా పడి ఉన్న పెద్ద బండరాయిని చూసి, విష యం తెలుసుకుని అవలీలగా ఒక్క చేతితో ఎత్తి అనుకున్న స్థలంలో పెట్టారు. ఆయన అతిలోక బల సామర్థ్యానికి నిద ర్శనంగా, ఆ బండ మీద ”శ్రీ మధ్వాచార్వైరేక హస్తేన ఆనీ య స్థాపిత శిలా”అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. తమ 79వ ఏట క్రీ.శ.1817లో మాఘశుక్ల నవమి నాడు శిష్య సమేతులై బదరీ నారాయణుని దర్శించి, ఉత్తర బదిరిని ఒంటరిగా చేరి, వ్యాస భగవానుని కైంక ర్యాలలో నిమగ్నమయ్యారు.
- రామ కిష్టయ్య సంగనభట్ల
9440595494