Tuesday, November 19, 2024

మాతా పితృ సేవ – భక్తి

కలియుగంలో మానవ జీవితం ‘శాస్త్రవిధి’నను సరించి ఉంటుంది. అలానే వుండాలి. మానవ మన స్సులు పవిత్రం కావలెనన్న ప్రాచీన మహర్షుల వలె పవిత్ర జీవితం గడపాలి. దృఢ సంకల్పం కలిగియుండాలి. ఇంద్రి య నిగ్రహం- సదాచారం- సేవ- ధర్మం మున్నగు వాటి విధిని పాటించినపుడే జీవితం బాగుపడుతుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి. జీవితాలు ధన్యమౌతాయి. మన స్సు పవిత్రమవుతుంది. పుస్తక పఠనం వలన శబ్ద జ్ఞానమే వృద్ధి అవుతుంది. కానీ పవిత్రత ఏర్పడదు. దానధర్మాలు చేసినా పవిత్రం కాదు.
రామాయణమే అందరికీ మార్గదర్శకం. శ్రీరాముడు తాను ప్రతి ధ ర్మాన్నీ పాటించేవాడు. పాపం పట్ల భయం కలిగియుండాలి. మానవుని తాను చేసుకున్న పాపమే నశిం పజేస్తుంది. ఈశ్వరుడు మాత్రం కాదు. రామాయణంలో విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రాముడు గురు మార్గాన్ని అను సరించాడు. విశ్వామిత్రుడు ఒక శిలను చూపించి ‘రామా! ఈ అహల్యను స్పృశించు’ అన్నాడు. రాముడు ”గురువుగారూ! నేను పరకాంతను ముట్టను. అన్యధా నాకు పాపం అంటు కుంటుంది” అన్నాడు.
మాతృపితృభక్తి- బంధుప్రీతి- నిగ్రహశక్తి- సదాచార ము- మృదుస్వభా వము- ఏకపత్రీవ్రతము- సత్యవాక్పా లన- ఔదార్యము- శరణాగత వాత్స ల్యము- నిర్భయత్వము- మధురభాష ణత్వము మున్నగు సద్గుణములన్నీ శ్రీరామునిలో నిండి ఉన్నాయి. అందుకే ఆయన సద్గుణాభిరాముడైనాడు.
శ్రీరాముడు తల్లిదండ్రుల యెడ అనన్యమైన భక్తిగలిగియుండెడివాడు. ప్రతినిత్యము భక్తితో మాతా, పితలకు నమస్కరించేవాడు. వారి ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ వుండేవాడు. కొందరు ఆలయాలకు వెళ్ళి భగ వంతునికి నమస్కరిస్తూ వుంటారు. కానీ తమ యింటిలోనున్న భగవత్స్వ రూపులైన తమ ముదుసలి తల్లిదండ్రులకు నమస్కరించరు. వారు దానిని నామోషిగా భావిస్తారు.
భగవంతుడొకసారి ఒక విద్యార్థికి కలలో దర్శనమిచ్చి ఇలా అడిగాడు- ”నీవు నాకైతే ప్రతినిత్యం నమస్కరిస్తున్నావు. కానీ నీ యింటిలోనున్న వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నావా?” అని అడిగాడు. ఆ విద్యా ర్థి జవాబుగా ”ఒకప్పుడైతే చేసేవాడిని కానీ, బి.ఏ పాసైన తరువాత చేయడం మానేశాను” అన్నాడట. చదువుకున్నవాని సమాధానం యిది. ఏ చదువు వలన తల్లిదండ్రులకు నమస్కరించడానికిగానీ, సేవ చేయడానికిగానీ సందే హం కలుగుతుందో అలాంటి చదువులెందుకు? తల్లిదండ్రులకు సేవ చేయని వాడు, దేశానికీ, సంఘానికీ లేక భగవంతునికీ సేవ ఎలా చేయగలడు? ఏ విద్య తల్లిదండ్రులకు నమస్కరించడానికి సిగ్గును కలుగజేస్తుందో అది విద్య కానే కాదు. తల్లిదండ్రుల ధనం, ఆస్తులు తీసుకోవడానికి లేని సంకోచం, నమస్క రించడానికెందుకో మరి?
కొందరు మొక్కుబడిగా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తారు గానీ, వారి ఆజ్ఞను పాటించరు. వారి మాటలను లెక్కచేయరు. అట్టివారి నమస్కారానికి ప్రయోజనముండదు. మస్తిష్కము బుద్ధికి ప్రతీకము అయితే, చేతులు క్రియాశక్తికి ప్రతీకములు.
తల్లిదండ్రుల యాజ్ఞను పాటించండి. సేవ చేయండి. వారికి సేవ చేస్తే మీ సంతతి మీరు వృద్ధాప్యంలో సేవ చేస్తుంది. ఇదే సత్‌సంప్రదాయం. మంచి సంస్కారం అవుతుంది. తల్లి-తండ్రి-గురువు- దైవం- అతిథి వీరే ప్రత్యక్ష దైవాలు. అందులో తల్లిదే అగ్రస్థానం. తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పరమాత్మ స్వరూపులు. భగవంతుని సేవించకపోయినా తల్లిదండ్రులయందు తప్పని సరిగా భక్తిభావన కలిగియుండాలి. తల్లిదండ్రులను సేవించకపోతే భగవం తునికి కోపం వస్తుంది. చదువుకున్నవారికి భగవంతునియందు నమ్మక ముండదు. అయినా అలాంటి నాస్తికులను కూడా పోషిస్తూనే వుంటాడు. వారు కూడా భగవంతుని సృష్టిలోనే ఉన్నారు కదా!
తల్లిదండ్రుల సేవ ఎంతో పుణ్యప్రదమైనది. పలు యజ్ఞ యాగాదులు చేసిన ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం పుత్రులకు తమ వృద్ధ తల్లి దండ్రుల సేవవలన తేలికగా లభిస్తుంది. అట్టివారి గృహానికి భగవంతుడు ప్ర త్యక్షంగా వస్తాడని చరిత్ర తెలిపింది.
పుండరీకుని కథలో పుండరీకుడు నిత్యం తల్లిదండ్రుల సేవలోనే వున్నా డు. ఏనాడూ ఆలయాలకు వెళ్ళలేదు. భగవంతుని దర్శించలేదు. అయినా భగవంతుడే వారి యింటికి వచ్చాడు. ఆవేళలో పుండరీకుడు సేవలో నిమ గ్నుడైయున్నాడు. నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను. దయయుంచి నీవు కొంతకాలం వెలుపలనే ఉండవలసినది అని భగవంతుని కోరాడు.
తల్లిదండ్రుల సేవ జేయువారికి ఈశ్వరుని గూడా వెలపల నిలబడమని చెప్పగలిగే శక్తియుంటుంది. మీరు అనంతకోటి బ్రహ్మాండ నాయకులు. మీరా కతో మా జన్మ ధన్యమైనది. మా యింటికి వచ్చారు. నేను మీకు భక్తితో నమస్క రిస్తానుగానీ, మిమ్ములను సేవించుటకు ప్రస్తుతం నాకవకాశం లేదని విన యంగా భక్తితో కోరినాడు.
మాతాపితరుల సేవ వలన భగవద్దర్శనం కలుగుతుందనేది పుండ రీకుని భక్తి విశ్వాసం. పరమాత్మ భక్తపరాధీనుడు గదా! నేటికీ పరమాత్మ పండరీపురంలో నడుమున చేతినుంచుకొని ఇటుకపై నిలబడియున్నాడు. అదీ తల్లిదండ్రుల సేవా మహాత్మ్యం. మానవ దేహం అతి దుర్లభమైనది. శాస్త్రాలలో చతుర్విధ పురుషార్థాలు సిద్దింపచేసుకోవాలంటే ఆదర్శపురు షుడైన శ్రీరా మచంద్రుడే మనకు ఆదర్శం. తల్లిదండ్రుల పట్ల, పినతల్లి కైకేయి పట్ల ఆయన చూపిన వినయ విధేయతలు మానవ జాతికి మార్గదర్శకం. శ్రీ రాముని మాతృపితృ భక్తి విలక్షణమైనది. తరతరాలకు నిలబడగలిగేది శ్రీ రామచంద్రుని శీల సంపదే. రామాయణం యిచ్చే సంపద, సందేశం విశ్వ శ్రేయస్సుకొరకే.

Advertisement

తాజా వార్తలు

Advertisement