Friday, November 22, 2024

మాతాపితరుల సేవా ఫలం

పద్మపురాణం ”మాతాపితరుల సేవా” ఫలాన్ని ఇలా తెలియపరుస్తోంది.
” పుత్రస్య జాయతే తకో మాతుశ్శుశూషణాదపి
పితుశ్శుశూషణతద్వత్‌ మహాత్పుణ్యం ప్రజాయితే !!
తత్ర గంగా గయాతీర్థం తత్ర పుష్కర మేవచ
యత్ర మాతా పితాతిష్టేత్‌ పుత్ర స్యాపి సంశయ:.!!
అంటే తల్లిని సేవించడం వల్ల పుత్రుడుకి ఉత్తమ లోకాలు లభిస్తాయి. తండ్రిని సేవించడం వల్ల, మహా పుణ్యం, ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. తల్లిదండ్రులు ఉన్న స్థావరమే పుత్రుడుకి గంగా- గయ వంటి పుణ్యతీర్థ స్థలం. ఉభయులను సేవించిన వారికి అన్ని పుణ్యతీర్థా ల స్నానఫలం లభిస్తుంది.
ఇహ-పర సౌఖ్యాలు పొందుతారు. దేవతలు, మహ ర్షుల ఆశీర్వచనా బలం ఉంటుంది. అంతకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి శుభ ఫలితాలు కలుగచేస్తాడు. పవిత్రమైన ఆహారంతో తల్లిదండ్రులను సంతృప్తిపరిస్తే మంచి జ్ఞానవంతులై, మంచి కీర్తిని పొందుతారు.
ఏదైనా కార్యం మీద బయటకు వెళ్ళే సందర్భం లో వారి ఆశీస్సులు పొందడం వల్ల విజయం సిద్ధిస్తుం ది. సీతాన్వేషణ సందర్భంలో, హనుమ లంకకు వెళ్ళే ముందు మైనాకు పర్వతం చేరి, తల్లిదండ్రులకు, గురు వుకు, తన రాజుకు ఎందరో మహర్షులకు మన: పూర్వక నమ స్సుమాంజలి ఘటించే ముందుకు సాగాడు. అలాగే శ్రీ రాముడు వనవాసానికి బయలుదేరేముందు తల్లిదం డ్రులకు పాదాభివందనం చేసి, ఆశీస్సులు పొందాడు. ఇటువంటి సంఘటనలే మనకు ఆదర్శం. తల్లిదండ్రుల కు ఏదైనా సందర్భంలో స్నానం చేయించేటప్పుడు వారి శరీరంనుంచి పుత్రుల శరీరం మీద పడిన నీటిబిందువు లు వల్ల సర్వతీర్థాలలో స్నానఫలం పొందుతారు.
పతితులు, వృద్ధులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు అయిన సందర్భంలో వారికి చేసిన సేవలకు శి వుడు సంతోషపడి, కైలాస ప్రాప్తి కలిగిస్తాడు. వినాయక చవితి కథలో గణాల ఆధిపత్యం గురించి విఘ్నేశ్వరుడుకు తల్లి తండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నారాయణ మంత్రం పఠిస్తే సర్వ పుణ్యనదుల స్నానఫ లం సిద్ధిస్తుందని శివుడు తెలిపారు. తల్లిదండ్రులను హంసించే పుత్రులకు, మరు సటి జన్మలో మొసళ్ళుగాను, కఠినమైన మాటలతో, మనసు. గాయపడేవిధంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మలో అడవిలో క్రూర జంతువులుగా పుడతారని పద్మపురాణం విశదపరుస్తోంది.
శ్రీరాముడు పితృవాక్యా పాలకుడుగా పేరుపొం దాడు. తండ్రి మరణించిన విషయం, భరతుని ద్వారా తెలుసుకున్న శ్రీరాముడు, ఉత్తర క్రియలు భరతుడు చేసాడని ఊరుకోలేదు. తన కర్తవ్యాన్ని విస్మరించకుండా, ఉత్తర క్రియలు, తాను ఉన్న వనంలోనే నిర్వహంచాడు.
శ్రవణకుమారుడు అంధులైన తల్లిదండ్రులు శంత నుడు జ్ఞానవతిల కోరిక నెరవేర్చుటకు ఆత్మశుద్ధి కొరకు, పుణ్యక్షేత్రాలు తీసుకొని వెడుతున్న సందర్భంలోనే, దశ రథుని బాణానికి ఆ శ్రవణకుమారుడు మరణించిన విష యం మనకు తెలిసిందే.
దేవవ్రతుడు తన తండ్రి శంతన మహారాజు కోరిక నెరవేరుటకు, అవివాహతుడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి, లోకానికి భీష్ముడుగా గుర్తింపు పొందాడు. ఇంకా ఎన్నో గాథలు, విశేషాలు పురాణాలలో కనపడతాయి. ఇవన్నీ మన కర్తవ్యం గుర్తెరిగి బాధ్యతతో ప్రవర్తించమని తెలియచేస్తున్నాయి.
పుండరీకుని కథలో పుండరీకుడు నిత్యం తల్లిదం డ్రులు సేవలో నిమగ్నమై ఉండేవాడు. పాండురంగడు పరీక్షించడానికి ఇంటికి వచ్చి పిలిస్తే ,”నేను తల్లిదండ్రు లు సేవలో ఉన్నాను. కాసేపు బయటే కూర్చో” అంటే, పాండురంగడు బయటే నిలబడిపోయాడు. అంటే తల్లిదండ్రులు సేవలో దైవాన్ని శాసించే శక్తి ఉంటుంది.
బృహదారణ్యకోపనిషత్తులో కూడా తల్లితండ్రులు పట్ల సంతతి ఎలా ప్రవరించాలో వివరించబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement