Wednesday, January 15, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 49
49
దూరేణ హ్యవరం కర్మ
బుద్ధియోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ
కృపణా: ఫలహేతవ: ||

తాత్పర్యము : ఓ ధనంజయా ! భక్తియోగముచే హీనకర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మ ఫలములు అనుభవింపగోరువారు లోభులు.

భాష్యము : కృపణులు అనగా ఎంతో ధనము ఉండి కూడా ఏమీ ఖర్చుపెట్టని వారు. అలాగే ఫలములను ఆశించి పనిచేయువారు ఆ ఫలములు వచ్చిన పిమ్మట, వాటిపట్ల ఆకర్షణ పెంచుకొందురు. ఇలా భౌతిక బంధనములో (జన్మ మృత్యు చక్రములో) చిక్కుకు పోవుదురు. కాబట్టి ఎవరూ కూడా కార్యములకు కారకుడనని భావించి, ఫలితాలను ఆశిస్తూ బంధీలు కాకూడదు. జీవుడు భగవంతుని దాసుడు. భగవంతుని కోసము మాత్రమే జీవుడు కార్యములను ఉపయోగించినట్లయితే ముక్తుడు కాగలుగుతాడు. ఇటువంటి ఉన్నత లక్ష్యముతో మానవ శక్తిని ఉపయోగించినట్లయితే ఎవ్వరూ కృపణులుగా మిగిలిపోవలసిన అవసరము ఉండదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement