Monday, January 6, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 37
37
హతో వా ప్రాప్స్యసి స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌ |
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ
యుద్ధాయ కృతనిశ్చయ: ||

తాత్పర్యము : ఓ కుంతీపుత్రా ! నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృతనిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము.

భాష్యము : అర్జునుడు తప్పక గెలుస్తాడు, అనేది స్పష్టముగా తెలియకున్నా యుద్ధము చేయుట తప్పనిసరి. ఎందువలనంటే యుద్ధములో చంపబడినా స్వర్గలోకాలకు చేరే అవకాశము ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement