Saturday, January 4, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 36
36

అవాచ్యవాదాంశ్చ బహూన్‌
వదిష్యంతి తవాహితా: |
నిందంతస్తవ సామర్థ్యం
తతో దు:ఖతరం ను కిమ్‌ ||

తాత్పర్యము : నీ శత్రువులు నిన్ను పలు నిర్ధయవాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను నీకు దు:ఖకరమైనది వేరేది గలదు?

భాష్యము : అర్జునుని అనవసరపు కరుణను చూసి మొట్టమొదట శ్రీ కృష్ణుడు ఆశ్చర్యము చెంది ఇది అనార్యులకు తగినది కాని అర్జునునికి తగదని తెలియజేసెను. ఇప్పుడు పలు విధములుగా అర్జునుని కరుణ సరైనది కాదని నిరూపించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement