Friday, January 3, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 35
35

భయాద్రణాదుపరతం
మంస్యంతే త్వాం మహారథా: |
యేషాం చ త్వం బహుమతో
భూత్వా యాస్యసి లాఘవమ్‌ ||

తాత్పర్యము : నీ పేరు ప్రతిష్ఠల యెడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనాధిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడినావని తలచి నిన్ను చులకన చేయుదురు.

భాష్యము : శ్రీకృష్ణుడు, అర్జునునికి తన హితవును కొనసాగించెను ”దుర్యోధునుడు, కర్ణుడు వంటి సేనా నాయకులు నీకు సోదరుల పట్ల, తాతగారి పట్ల ఉన్న కరుణతో యుద్ధము చేయుటలేదని భావింపక కేవలము భయముచేత పారిపోవుచున్నావని భావించుదురు. అలా నీ కీర్తి మంటగలుచును.”

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement