Tuesday, December 31, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 33
33

అథ చేత్త్వమిమం ధర్మ్యం
సంగ్రామం న కరిష్యసి |
తత: స్వధర్మం కీర్తిం చ
హిత్వా పాపమవాప్స్యసి ||

తాత్పర్యము : ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచి నందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడవనెడి కీర్తిని నీవు పోగొట్టుకొందువు.

భాష్యము : అర్జునుడు గొప్ప యోధుడు. దేవతలను సైతము ఓడించెనను కీర్తి కలదు. ఒకసారి శివుడు వేటగాడి రూపములో రాగా అతనిని కూడా ఓడించుట చేత శివుడు తన పాశుపతాస్త్రాన్ని బహుమానముగా ఇచ్చెను. ద్రోణాచార్యుడు అనేక దీవెనలను ఇచ్చి ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని కూడా అర్జునుడికి ఇచ్చెను. ఇలా అర్జునుడు అనేకమంది వరాలను, ఆయుధాలను పొంది ఉన్నాడు. ఇప్పుడు యుద్ధ సమయములో భిక్షాటనకు వెళ్ళినట్లయితే క్షత్రియుడిగా తన ధర్మాన్ని నిర్లక్ష్యము చేసినవాడే కాక, తన అపారమైన కీర్తిని మంట కలిపిన వాడగును. మరొక విధముగా చెప్పవలెనన్న యుద్ధము చేయకపోవుట వలన నరకానికి వెళ్ళును గాని, చేయుట వలన కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement