Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 5

అపరేయమితస ్త్వన్యాం
ప్రకృతి విద్ధి మే పరామ్‌ |
జీవభూతాం మహాబాహో
యయేదం ధార్యతే జగత్‌ ||

తాత్పర్యము : ఓ మహానుబాహుడవైన అర్జునా! వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతి ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు.

భాష్యము : ఈ శ్లోకము నందు జీవుడు భగవంతుని ఉన్నత శక్తిగా వర్ణించబడినాడు. జీవుడు భగవంతుని వలే దివ్యగుణమును కలిగి ఉన్నందున ఉన్నతమైన శక్తిగా పరిగణించబడినాడు. అయితే జీవుడు పరిమాణములో ఎన్నడునూ భగవంతుడి తో సమానుడు కాలేడు. జీవుడు భౌతిక మోహములో తానే అధిపతినని భావించి భౌతిక ప్రకృతి సంపదను అనుభవిస్తూ ఉండటము చేత ఈ భౌతిక జగత్తు నడిపించబడుతుంది. జీవుని ప్రమేయము లేనిదే ఎక్కడ
వేసిన వస్తువు అక్కడే ఉంటుంది. భౌతిక ప్రకృతి స్వతహాగా చలించదు. అయితే ఈ జీవి కూడా భగవంతుని శక్తిలో భాగమే కనుక శక్తివంతుడైన భగవంతుని ఆధీనములోనే ఉండవలసి వస్తుంది. ఎప్పుడైతే జీవుడు భగవంతుని ఆధిపత్యాన్ని గుర్తించి శరణు పొందుతాడో భౌతిక మోహము తొలగి ముక్తుడు లేదా కృష్ణచైతన్యవంతుడు అవుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement