Friday, December 27, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 31
31

స్వధర్మమపి చావేక్ష్య
న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో న్యత్‌
క్షత్రియస్య న విద్యతే ||

తాత్పర్యము : క్షత్రియునిగా స్వధర్మము ననుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరొక్కటి లేదని నీవెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు.

భాష్యము : క్షత్రియ అనగా హాని తలపెట్టేవారి నుండి కాపాడేవాడు అని అర్థం. ఆ విధముగా తన ధర్మాన్ని నిర్వహించుటకు, దుష్టులను శిక్షించుట లేదా శత్రువులను హతమార్చే నేర్పరితనము కలిగి ఉండాలి. అందుకై వారు అడవికి వెళ్ళి జంతువులను వేటాడుట నేర్చుకుంటారు. ఈ విధముగా భగవంతుడు ఏర్పాటు చేసిన వర్ణాశ్రమ ధర్మాలను నిర్వహించుట చేత మానవుడు ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశము కలిగి ఉంటాడు. అలాగే బ్రాహ్మణులు తమ మంత్ర శక్తిని పరీక్షించుకొనుటకు జంతువులను చంపబడిన క్షత్రియులు స్వర్గలోకాలను, యజ్ఞములో అర్పింపబడిన జంతువులు, మానవ శరీరములను పొందుదురు. కాబట్టి దీనిని సామాన్య హింసాకాండతో పోల్చరాదు. త్రిగుణములలో ఉన్నంతకాలము ధర్మ నిర్వహణ బద్ధ జీవులందరికీ ముఖ్యము. అది క్రమేణ ముక్తి మార్గమునకు దారితీస్తుంది. ముక్తులైన వారికి ఆధ్యాత్మిక ధర్మ నిర్వహణ ఉంటుంది. ఇలా వెరైనా తమ స్వధర్మాలను ప్రామాణికుల మార్గదర్శకములో నిర్వహించినట్లయితే వారు తప్పక ఉన్నత స్థితికి ఉద్ధరించబడుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement