Monday, December 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 27
27

జాతస్య హి ధ్రువో మృత్యు:
ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే ర్థే
న త్వం శోచితుమర్హసి ||

తాత్పర్యము : పుట్టినవానికి మరణము తప్పదు మరియు మరణము తరువాత జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుక్తధర్మ నిర్వహణము నందు నీవు దు:ఖింపరాదు.

భాష్యము : ప్రతి వ్యక్తికి తాను ఉన్నప్పుడు చేసిన పనులను బట్టి మరుజన్మ ఇవ్వబడుతుంది. ఆ జన్మలో పూర్వపు ఫలితాలను అనుభవిస్తూ భవిష్యత్తును సృష్టించుకుంటాడు. ఇలా జన్మమృత్యు చక్రములో కొట్టుమిట్టాడుతూ ముక్తికి నోచుకోడు. అలా అని ఇష్టము వచ్చినట్లు హత్యలు చేయుటను, హింసించుటను, యుద్ధాలను సమర్థించరాదు. కాని న్యాయమును కాపాడుటకు కొన్ని ఇష్టము వచ్చినట్లు హత్యలు చేయుటు, హింసించుటను, యుద్ధాలను సమర్థించరాదు. కాని న్యాయమును కాపాడుటకు కొన్ని సందర్భాలలో హింస, యుద్ధాలు అవసరము. అయితే కురుక్షేత్ర రణరంగము భగవంతునిచే ఏర్పాటు చేయబడుటచే, సరైన కారణమున యుద్ధము చేయుట క్షత్రియ ధర్మము, కానీ అలా చేస్తే ద్రోణుడు భీష్‌ములను సంహరించినందుకు పాపము వచ్చునని భావించినట్లయితే తాను సంహరింపని మాత్రాన వారు ఎల్లకాలము జీవించగలరా? వారి మృత్యువును ఆపగలడా? తాను తన ధర్మ నిర్వహణలో నిర్లక్ష్యము చేసినందుకు కూడా పాపము వచ్చునని గుర్తించవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement