Saturday, December 21, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 25

అవ్యక్తో యమచింత్యో యమ్‌
అవికార్యో యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం
నానుశోచితుమర్హసి||

తాత్పర్యము : ఆత్మ అవ్యక్తము, ఆచింత్యము, మార్పు రహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలిసిన పిమ్మట దేహమును గూర్చి నీవు చింతించరాదు.

భాష్యము : మనము అనేక విషయాలను ప్రామాణిక వ్యక్తుల ద్వారా మాత్రమే తెలుసుకొనగలము. ప్రతి ఒక్కరికీ తండ్రి ఉన్నాడనేది వాస్తవమే అయినా తల్లిచెప్పకుండా తండ్రిని గుర్తించలేము. అలాగే మనకున్న ఉత్తమమైన మైక్రోస్కోపుల ద్వారా కూడా ఆత్మను చూడలేము. ఆత్మ ఉనికి మనకు అర్థమగుచున్నా, కేవలము వేదాల ద్వారా మాత్రమే దానిని అర్థము చేసుకోగలము. వేదాలలో ఆత్మ చైతన్యవంతమని, శాశ్వతముగా మార్పులేనిదని, అణుమాత్రమని, భగవంతుడు విభువని కాబట్టి అది ఎప్పటికీ భగవంతునితో సమానము కాలేదని పరిపరి విధములుగా వివరించటం జరిగింది. వేర్వేరు కోణాల నుండి తెలియజేయుట ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చర్చించి తికమక పడుటకు అవకాశము ఇవ్వలేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement