Wednesday, December 18, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 22
22

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణా –
న్యన్యాని సంయాతి నవాని దేహీ ||

తాత్పర్యము : మనుజుడు పాతవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి, ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది.

భాష్యము : ఆత్మ శరీరాలను మారుస్తుందనేది అందరూ అంగీకరించే సత్యము. శాస్త్రజ్ఞులు సైతము గుండె చప్పుడుకు కావలసిన శక్తి ఆత్మనుండి వస్తుందని గుర్తించలేకపోయినా, మన శరీరము బాల్యము నుండి యవ్వనమునకు తరువాత ముసలి తనమునకు చివరకు మృత్యువునకు గురి అవుతుందని గుర్తించగలగాలి. మృత్యువు తర్వాత ఆత్మవేరొక శరీరమున ప్రవేశింపబడుతుందని, ఆ ప్రక్రియ పరమాత్మ పర్యవేక్షణలో జరుగుతుందని ముండక, శ్వేతశ్వతర ఉపనిషత్తులందు వివరించటమైనది. అందు ఆత్మ, పరమాత్మలు, ఒకే చెట్టుపై ఉండే రెండు స్నేహపూర్వకమైన పక్షుల వంటివని, ఒక పక్షి ఆ చెట్టు ఫలాలను తింటూ ఆందోళనను దు:ఖాన్ని కొని తెచ్చుకుంటుందని, రెండవ పక్షి దానిని గమనిస్తూ ఉంటుందని చెప్పబడినది. ఎప్పుడైతే ఆత్మ, పరమాత్మను గుర్తించి అర్జునుని వలే కృష్ణునికి శరణు పొందుతుందో సర్వదుం:ఖాల నుండి విముక్తిని పొందుతుంది. అదేవిధముగా అర్జునుడు కృష్ణుని ఆదేశములను స్వీకరించి ద్రోణుడు, భీష్‌ములకు కొత్త శరీరాలను ఇచ్చి ఉన్నత లోకాలకు వెళ్ళే అవకాశమును కల్పించినట్లయితే అతని ఆందోళ పటాపంచలైపోగలదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement