Wednesday, December 18, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 21
21

వేదవినాశినం నిత్యం
య ఏనమజమవ్యయమ్‌ |
కథం స పురుష: పార్థ
కం ఘాతయతి హంతి కమ్‌ ||

తాత్పర్యము : ఓ పార్థా ! ఆత్మ నాశము లేనిదనియు, నిత్యమైనదనియు, పుట్టుకలేనిదనియు, అవ్యయమైనదనియు తెలిసినవాడు ఎవ్వరినేని ఎట్లు చంపును? లేదా చంపించును?

భాష్యము : ప్రతి కార్యమునకు ఒక ప్రయోజనము ఉంటుంది. జ్ఞానము కలిగినవాడు సత్ప్రయోజనమునకు ఉపయోగించును. ఉదాహరణకు న్యాయమూర్తి ఒక హంతకునికి ఉరిశిక్ష విధించవచ్చును. ‘మను సంహిత’ వంటి శాస్త్రాల ప్రకారము అటువంటి శిక్ష మంచిదే! ఎందువలనంటే నేడు ఈ శిక్షను తప్పించుకున్నట్లయితే వచ్చే జన్మలో అతడు ఇంకా తీవ్రముగా శిక్షింపబడతాడు. కాబట్టి న్యాయశాస్త్రాల ప్రకారము విధింపబడు శిక్షలు హింసవలే కనిపించినా ఆ వ్యక్తికి మేలు మాత్రమే చేస్తాయి. ఎలాగూ ఆత్మ సంహరింపబడదు కనుక అటువంటి మేలు కోరి చేసే హింస ; హింస కానే కాదు. డాక్టరు చేసే శస్త్ర చికిత్స రోగిని కాపాడుటకే గాని చంపుటకు కాదు. అలాగే ఇక్కడ న్యాయమూర్తి అయిన కృష్ణుని ఆదేశము ప్రకారము అర్జునుడు చేసే హింసకు పాపము ఉండదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement