Wednesday, December 4, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 15
15

యం హి న వ్యథయంత్యేతే
పురుషం పురుషర్షభ |
సమదు:ఖసుఖం ధీరం
సో మృతత్వాయ కల్పతే ||

తాత్పర్యము : ఓ మానవశ్రేష్ఠుడా (అర్జునా)! సుఖదు:ఖములచే కలత నొందక, ఆ రెండింటియందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై యున్నాడు.

భాష్యము : ఎవరైతే ఆధ్యాత్మిక పురోగతి కోసం, తాత్కాలిక సుఖదు:ఖాలను ఓర్చుకుని ముందుకు సాగుచుందురో అట్టివారు మోక్షమునకు అర్హులగుదురు. వర్ణాశ్రమ ధర్మాలలో సన్యాసము కష్టతరమైనది. బంధువులు, భార్య, పిల్లలను విడిచి ఉండవలసి వస్తుందని. ఆ కష్టాలన్నింటినీ ఓర్చుకుని సన్యాస ధర్మాలను నిర్వహించే వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అలాగే అర్జునుడు కూడా బంధువులతో గల సంబంధాలను ఓర్చుకుని యుద్ధము చేయవలెనని సూచించటమైనది. దీనికి మంచి ఉదాహరణ శ్రీ చైతన్య మహాప్రభువు ఆయన యుక్త వయస్సులోనే తల్లి, భార్యలను విడిచి ఉన్నత లక్ష్యము కోసము సన్యాసము స్వీకరించి ఆ ఆశ్రమ ధర్మాలను చక్కగా నిర్వహించిరి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement