Wednesday, December 4, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 13
13

దేహినో స్మిన్‌ యథా దేహే
కౌమారం ¸°వనం జరా |
తథా దేహాంతరప్రాప్తి:
ధీరస్తత్ర న ముహ్యతి ||

తాత్పర్యము : దేహధారి దేహమునందు బాల్యము నుండి ¸°వ్వనమునకు, ¸°వ్వనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా పొందు రీతి మరణానంతరము వేరొక దేహమును పొందురు. అట్టి మార్పు విషయమున ధీరుడైనవాడు మోహ మునొందడు.

భాష్యము : జీవుడు తన శరీరాలను మారుస్తూ ఉండును. బాలుని శరీరము నుండి యవ్వన శరీరమునకు తరువాత ముదుసలి శరీరమునకు, చివరకి మృత్యువు తరువాత మరొక శరీరమునకు మార్పు చెందును. కానీ ఆత్మమార్పు చెందదు కాబట్టి వీటిని గమనిస్తూ ఉంటుంది. కర్మానుసారము ప్రతి జీవునికి వేరొక శరీరము ఇవ్వబడుతుంది. అలాగే భీష్‌ముడు, ద్రోణుడు కూడా ముదుసలి శరీరాలను వదిలి స్వర్గానికి కాని, లేదా వైకుంఠానికి గానీ వెళ్ళే అవకాశము వస్తుంది. దీనిని అర్థము చేసుకుని అర్జునుడు దు:ఖించరాజు. కాబట్టి ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మిక భౌతిక ప్రకృతులను అర్థము చేసుకున్న ధీరుడు సంపూర్ణ జ్ఞానమును కలిగి శరీర మార్పులకు కలత చెందడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement