Saturday, November 30, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 11
11

శ్రీ భగవాన్‌ ఉవాచ
అశోచ్యానన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ
నానుశోచంతి పండితా : ||

తాత్పర్యము : పూర్ణపురుషోత్తముడగు శ్రీ కృష్ణభగవానుడు పలికెను : ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దు:ఖింపదగని విషయమును గూర్చి దు:ఖించుచున్నావు. పండితులైనవారు జీవించియున్నవారిని గూర్చిగాని, మరణించిన వారిని గూర్చి గాని దు:ఖింపరు.

భాష్యము : శ్రీ కృష్ణుడు గురువుగా తన పాత్రను స్వీకరించి మొట్టమొదటగా శిష్యున్ని మందలించెను. జ్ఞానము లేకున్నా పండితుడిగా మాట్లాడుచున్నాడని తేటతెల్లము చేసెను. జ్ఞానము అనగా మనము శరీరమునకు అతీతముగా ఆత్మయని, భగవంతునితో సంబంధమును కలిగి ఉన్నామని తెలుసుకొనుట. దీనిని మనము రాబోవు అధ్యాయాలలో తెలుసుకొందుము. అయితే అర్జునుడు నీతి, నియమాలు, రాజకీయము కంటే వర్ణాశ్రమ ధర్మాలు ముఖ్యమని వాదించనా, వాటికంటే ముఖ్యమమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరచెను. అందువలన జన్మించుట, మరణించుట అనే శరీర మార్పులకు కలత చెందుచుండును. కానీ నిజమైన పండతుడు, శరీరము కంటే ఆత్మకు విలువనిచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement