Sunday, November 24, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 05
05

గురూనహత్వా హి మహానుభావాన్‌
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీవ భోగాన్‌ రుధిరప్రదిగ్ధాన్‌ ||

తాత్పర్యము : గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికినీ వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తమయమగును.

భాష్యము : శాస్త్ర విచారణ ప్రకారము, గురువు విచక్షణా జ్ఞానాన్ని వదిలివేసి హేయమైన కార్యమును చేసినప్పుడు, అతనిని తిరస్కరించవచ్చును. ఇక్కడ కూడా భీష్‌ముడు, ద్రోణుడు ఉన్నత ధర్మాన్ని మరచి, తమను పోషిస్తున్నాడు కదా అని దుర్యోధనుడి తరపున యుద్ధము చేయుటకు సిద్ధపడరి. అలా అధర్మ పక్షాన చేరినందులకు గురువులుగా కొనసాగుటకు అర్హతను కోల్పోయిరి. కానీ అర్జునుడు వారు ఇప్పటికీ గురువులుగా గౌరవింపదగిన వారేనని వారిని సంహరించి పొందే భౌతిక సంపత్తులు రక్తపు కూడుగా మారతాయని భావించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement