Friday, November 15, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 42
42

దోషైరేతై: కులఘ్నానాం
వర్ణసంకరకారకై:
ఉత్సాద్యంతే జాతిధర్మా:
కులధర్మాశ్చ శాశ్వతా: ||

తాత్పర్యము : వంశాచారమును నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును.

భాష్యము : సనాతన ధర్మాలు లేదా వర్ణాశ్రమ ధర్మాలు మరియు కుటుంబ ఆచారాలు అన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోరి మానవ సమాజాన్ని ముక్తి మార్గం వైపుకు నడపించడానికి ఉద్దేశింపబడినవి. నాయకులైనవారు వీటిని నిర్లక్ష్యము చేయుట వలన సమాజము అథోగతి పాలై ప్రజలు మానవ జీవిత ముఖ్యలక్ష్యమైన విష్ణువును మరచిపోవుచున్నారు. కాబట్టి అట్టి నాయకులు అంథులు, వారిని పాటించే వారి జీవితాలు అంథకారముతో నిండిపోతాయి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement