Thursday, November 21, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 41
41

సంకరో నరకాయైవ
కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం
లుప్తపిండోదకక్రియా: ||

తాత్పర్యము : అవాంఛిత సంతానము వృద్ధియగుట వల కుటుంబము వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురకిని నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనము నొందుదురు.

భాష్యము : కర్మకాండ సిద్ధాంతాల ప్రకారము విష్ణువుకు అర్పించిన ప్రసాదమును పూర్వీకులకు పిండ ప్రదానముగా చేయవలసి ఉంటుంది. ఆ విధమైన సహాయమును అందించుట పుత్రుల బాధ్యత. అయితే భగవద్భక్తిలో నిమగ్నమైనవారు, వారి భక్తి చేత ఎంతో మంది పూర్వీకులను ఉద్ధరించగలరు. కాబట్ట భగవత్సేవ చేసే భక్తులు ఈ కార్యక్రమాలను నిర్వహించకుండానే పూర్వీకులకు మేలు చేయగలుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement