Sunday, December 1, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 36
36

పాపమేవాశ్రయోదస్మాన్‌
హత్వైతానాతతాయిన: |
తస్మాన్నార్హా వయం హంతుం
ధార్తరాష్ట్రాన్‌ స్వబాంధవాన్‌ |
స్వజనం హి కథం హత్వా
సుఖిన: స్యామ మాధవ |

తాత్పర్యము : ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణా ! స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము?

భాష్యము : వైదిక సంస్కృతి ప్రకారము దుర్మార్గులను చంపినప్పటికీ పాపము సంక్రమించదు. అయితే అర్జునుడు సాధువు కాబట్టి దుర్మార్గుల పట్ల కూడా కరుణను చూపించుచున్నాడు. రాముని పట్ల రావణుడు దుర్మార్గము గావించెను. దానికి రాముడు తగిన గుణపాఠాన్ని నేర్పించెను. రాముడు కూడా సత్ప్రవర్తనను కలిగి ఉన్నా పిరికితనాన్ని ప్రదర్శంచలేదు. అర్జునుని విషయంలో దుర్మార్గానికి పాల్పడిన వారు సోదరులు, పుత్రులు, స్నేహితుల వంటివారే. అందువలన వేరే వారి వషయంలో వలే కఠినంగా ప్రవర్తించరాదని భావించెను. అశాశ్వతమైన రాజ్యాధికారము కొరకు శాశ్వతమైన ముక్తి మార్గాన్ని కోల్పోవుట తెలివితక్కువ తనమని అభిప్రాయపడెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement