Wednesday, November 27, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 31
31

న చ శ్రేయో నుపశ్యామ్‌
హత్వా స్వజనమాహవే |
న కాంక్షే విజయం కృష్ణ
న చ రాజ్యం సుఖాని చ ||

తాత్పర్యము : ఓ కృష్ణా ! ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను చూడలేకున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంచింపలేకున్నాను.

భాష్యము : జీవుడు తన స్వార్థగతి, శ్రేయస్సు విష్ణువు లేదా కృష్ణున్ని ప్రసన్నము చేసుకొనుట అని తెలియనపుడు భౌతికసంబంధాలలో ఆనందమునకు ప్రాకులాడును. అలా అంధకారంలో కూరుకునిపోయి తమకు భౌతికముగా కూడా ఏది ఆనందాన్ని సమకూర్చగలదో గుర్తంచలేకపోతారు. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా తన కర్తవ్యాన్ని మరచిపోవుచున్నాడు. కృష్ణుని ఆజ్ఞ మేరకు యుద్ధములోసంహరింపబడిన వారందరూ కనీసము స్వర్గలోకానికి ప్రత్యేకించి తేజోవంతమైన సూర్యలోకానికీ వెళ్ళే అవకాశము ఉంటుంది. కానీ అర్జునుడు దీనిని కూడా గమనించక యుద్ధము వలన అందరినీ కోల్పోతానని దు:ఖమే మిగులుతుందని యుద్ధము చేయననే నిర్ణయానికి వచ్చుచున్నాడు. యుద్ధము చేయకపోతే, రాజ్యము లేక భిక్షాటన తప్పదు. కాబట్టి అర్జునుడు అడవికి వెళ్ళి ఏకాంతములో జీవితాన్ని వెళ్ళదీయుటే మంచిదని భావించెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement