Monday, November 18, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 29
29

వేపథుశ్చ శరీరే మే
రోమహర్షశ్చ జాయతే ||
గాండీవం స్రంసతే హస్తాత్‌
త్వక్చైవ పరిదహ్యతే |

తాత్పర్యము : నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచకమగుచున్నది. గాండీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది.

భాష్యము : శరీరము కంపించుట, రోమములు నిక్కబొడుచుకొనుట గొప్ప తన్మయత్వములో గానీ లేదా గొప్ప భయానక స్థితిలో గానీ సంభవించు అవకాశము ఉన్నది. దివ్యానుభూతిని పొందినపుడు భయమునకు తావేలేదు. కాబట్టి ఇక్కడ అర్జునుని తత్వము తనవారు మరణిస్తారనే భయము వలన సంభవించినదని చెప్పవచ్చును. తాను ఓపికను కూడా కోల్పోవుటచే గాంఢీవము చేజారినది. అలాగే హృదయము బాధతో దహించబడుటచే సరీరము మండుచున్న భావనను కలగించుచున్నది. ఇవన్నీ భౌతిక భావన వలననే కలుగుచున్నవని తెలియుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement