Sunday, November 3, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 26
26

తత్రాపశ్యత్‌ స్థితాన్‌ పార్థ:
పితౄనథ పితామహాన్‌ |
ఆచార్యాన్‌ మాతులాన్‌ భ్రాతౄన్‌
పుత్రాన్‌ పౌత్రాన్‌ సఖీంస్తథా ||
శ్వశురాన్‌ సుహృదశ్చైవ
సేనయోరుభయోరపి |

తాత్పర్యము : ఇరుపక్షపు సే నల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను స్నేహితులు, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.

భాష్యము : అర్జునుడు యుద్ధరంగమునందు అన్ని రకాలైన సంబంధీకులను చూసెను. తన తండ్రిక సమకాలీకులైన భూరీశ్రవుడు, తాతలైన భీష్‌ముడు, సోమదత్తుడు వంటివారిని గురువులైన ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంట వారిని మేనమామలైన శల్యుడు, శకుని వంటి వారిని, సోదరులైన దుర్యోధనుడి వంటివారిని, పుత్రులైన లక్ష్మణుడి వంటివారిని, స్నేహితులైన అశ్వద్ధామ వంటి వారిని, శ్రేయోభిలాషులైన కృపాచార్య వంటివారిని, ఇలా ఎందరో ఆత్మీయులను ఆ సైన్యము నందు అర్జునుడు చూసెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement