అధ్యాయం 1, శ్లోకం 25
25
భీష్మద్రోణ ప్రముఖత:
సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్
సమవేతాన్ కురూనితి ||
తాత్పర్యము : భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీ కృష్ణుడు ”ఓ పార్థా ! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము” అని పలికెను.
భాష్యము : హృషీకేశునిగా, పరమాత్మగా అందరి మనోగతాలను తెలుసుకొనగలిగిన కృష్ణుడు, అర్జునుని మనస్సును కూడా తెలుసుకుని ”కౌరవులందరినీ చూడుము” అని పలికెను. కృష్ణుని తండ్రియైన వసుదేవుని సోదరి కుంతీదేవి. అందువలన కుంతీ లేదా పృథకుమారుడైన పార్థుడు, అర్జునుని యొక్క రథాన్ని నడుపుటకు కృష్ణుడు అంగీకరించాడు. ఇంతా చేసిన తర్వాత అర్జునుడు యుద్ధము చేయబోడని, తన మేనత్త పుత్రుడుగా అది తగదని అర్జునుని మనస్సును అర్థము చేసుకున్న కృష్ణుడు తన మిత్రునితో హాస్యముగా పలికెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..