Tuesday, September 17, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

అధ్యాయం 6, శ్లోకం 47

47.
యోగినామపి సర్వేషాం
మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్‌ భజతే యో మాం
స మే యుక్తతమో మత: ||

తాత్పర్యము : అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును న్నే తనయందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను చేయువాడును అగు యోగి యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై యున్నాడు. అందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము.

భాష్యము : ఇక్కడ ‘భజతే’ అను పదము చాలా ముఖ్యమైనది. ‘భజ’ అనగా విశ్వాసపాత్రమైన సేవ మరియు ప్రేమించుట అని అర్ధము. ఆంగ్లములో దీనిని చాలా తక్కువ చేసి ‘ వర్‌ షిప్‌ ‘ అని అందురు. అనగా గౌరవించవలసిన వ్యక్తులను గౌరవించవలెను అని, గౌరవించకపోయినా కొం తహాని కలుగునేమో గాని. ‘భజ’ అనే పదము కేవలము భగవంతునికి మాత్రమే వర్తిస్తుంది. ఆయనను పూజించినట్లయితే జీవితమే నిరర్ధకమవుతుంది. మనము సహజరీత్యా శాశ్వతముగా ఆయన అంశలము, తద్వారా సేవకులము. కాబట్టి భగవంతుని సేవను నిరసించిన వ్యక్తి పతితుడగును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

- Advertisement -

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపని షత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయ:

Advertisement

తాజా వార్తలు

Advertisement