Monday, November 18, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 23
23

యోత్స్యమానానవేక్షే హం
య ఏతే త్ర సమాగతా: |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే:
యుద్ధే ప్రియచికీర్షవ: ||

తాత్పర్యము : దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.

భాష్యము : దుర్యోధనుడు మొదటి నుండీ పాండవులను తొలగించ రాజ్యాన్ని చేజిక్కంచుకొనుటకు తన తండ్రితో కలిసి అనేక పన్నాగాలను పన్నెను. ఇది అందరికీ తెలిసిన విషయమే.
మరి ఇవన్నీ తెలిసి కూడా దుర్యోధనుడితో చేతులు కలిపిన వారెవరో అర్జునుడు తెలుసుకోదలచెను. అంతేకాక ఈ యుద్ధములో తాను ఎదుర్కోవలసిన యోధులను, సైన్యమును లెక్కకట్టుటకు వారిని చూడదలచెను. అంతేకాని శాంతి ఒప్పందానికి మాత్రం కాదు. కృష్ణుడు తన పక్షమున ఉండుటచేత అర్జునుడికి తన గెలుపు పట్ల ఎట్టి సందేహము లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement