అధ్యాయం 1, శ్లోకం 21,22
21
అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే
రథం స్థాపయ మే చ్యుత ||
22
యావదేతాన్ నిరీక్షే హం
యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమ్
అస్మిన్ రణసముద్యమే ||
21-22తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా ! దయచేసి రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహా సంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును.
భాష్యము : శ్రీకృష్ణుడు దేవాదిదేవుడే అయినప్పటికీ నిర్హేతుకమైన కరుణతో తన స్నేహితుడికి సేవ చేయుచున్నాడు. తన భక్తులకు రక్షణనిచ్చుటలో ఎప్పుడూ విఫలుడు కాడు. కాబట్టి అచ్యుతుడు, అనగా విఫలము కాని వాడు అని అర్థము. రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటించుచున్నా భగవంతుడు ఎప్పుడూ భగవంతుడిగానే ఉంటాడని తన ఉన్నత స్థితిని కోల్పోడని అచ్యుతుడుగా సంబోధించబడ్డాడు. అంతేకాక భగవంతునికి భక్తునికి మధ్య ఎంతో మధుర మైన సంబంధము ఉంటుంది. హృషీకేశునిగా అందరికీ ఆజ్ఞలను ఇచ్చే భగవంతుడు, తన శుద్ధ భక్తులు తనను ఆజ్ఞాపించినపుడు ఇంకా ఆనందాన్ని పొందుతాడు. ఇక్కడ అర్జునుడు, ఒక శుద్ధ భక్తుడిగా ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. అయితే దుర్యోధనుడి మొండిపట్టు వలన యుద్ధానికి రావలసి వచ్చినది. అందువలన అటువంటి అనవసరపు యుద్ధాన్ని కోరుకొనుచున్న వారిని అర్జునుడు చూడదలచెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..