Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 20
20

అథ వ్యవస్థితాన్‌ దృష్ట్యా
ధార్తరాష్ట్రాన్‌ కపిధ్వజ: |
ప్రవృత్తే శస్త్రసంపాతే
ధనురుద్యమ్య పాండవ: ||
హృషీకేశం తదా వాక్యమ్‌
ఇదమహ మహీపతే |

తాత్పర్యము : ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా ! వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను.

భాష్యము : యద్ధము మొదలుకానున్నది. పైన తెలిపిన శ్లోకాల ప్రకారము శ్రీ కృష్ణుని సూచనల మేరకు పాండవులు చేసిన సైన్యపు ఏర్పాట్లను చూసి ధృతరాష్ట్రుని పుత్రుల ఆశలు నీరుకారాయని అర్థమగుచున్నది. అంతేకాక అర్జునుని జెండాపై హనుమంతుని చిహ్నము ఉండెను. హనుమంతుడు యుద్ధసమయంలో రాముని తరపున పోరాడెను. చివరకు రాముడు విజయము సాధించెను. ఇప్పుడు ఆ రాముడు కృష్ణుని రూపంలో ఈ హనుమంతుడు జెండా రూపములో అర్జునుని తరపున నిలబడి ఉన్నారు. అంతేకాక కృష్ణుడే స్వయంగా తగిన సూచనలను చేసి అర్జునుడిని నడిపిస్తూ ఉన్నాడు. శ్రీ కృష్ణుడు, తన శాశ్వత భక్తుడైన అర్జునునికి అన్ని రకాల శుభ సూచకాలను ఏర్పాటు చేయుట వలన విజయము సాధించుటకు పూర్తి అవకాశాలు ఉన్నవి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement