Sunday, November 24, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 14
14
తత: శ్వేతైర్హయైర్యుక్తే
మహతి స్యందనే స్థితౌ |
మాధవ: పాండవశ్చైవ
దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు: ||

తాత్పర్యము : ఎదుటి పక్షమున శ్రీ కృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు కలిగిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యశంఖములను పూరించిరి.

భాష్యము : భీష్‌ముని శంఖనాదానికి భి న్నముగా కృష్ణార్జునుల శంఖాలు దివ్యమైనవని ఇక్కడ చెప్పబడినవి. అనగా ఎదుటి పక్షము వారికి విజయము చేకూరే అవకాశమే లేదని ఈ వర్ణన స్పష్టము చేయుచున్నది. ”జయస్తు పాండుపుత్రాణాం యేషాం పక్షే జనార్థన:” జనార్ధనునితో సాంగత్యము వలన పాండ పుత్రులనే విజయము వరిస్తుంది. అంతేకాక భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి, సౌభాగ్యము, విజయము ఉంటుందని కనుక కృష్ణుని రూపములో విష్ణువు అర్జునుని చెంత ఉండుటచే వారిదే విజయమని తెలుస్తుంది. అంతేకాక, ముల్లోకాలలో ఎక్కడ నడిపినా విజయమును సాధించే అగ్నిదేవుని రథముపై క ృష్ణార్జునులు కూర్చునియుండుట మరొక విజయ సంకేతము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement