Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 12
12
తస్య సంజనయన్‌ హర్షం
కురువృద్ధ: పితామహ: |
సింహనాదం వినద్యోచ్చై:
శంకం దధ్మౌ ప్రతాపవాన్‌ ||

తాత్పర్యము : అప్పుడు కురువృద్ధుడును, యోధుల పితామహుడును అగు భీష్‌ముడు దుర్యోధనుననకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను.

భాష్యము : భీష్‌ముడు, తన మనుమడైన దుర్యోధనుని కలతను అర్థము చేసుకుని దానిని దూరము చేయుటకు సింహనాదము వలె శంఖువు పూరించి యుద్ధమునకు తన సంసిద్ధతను తెలియజేసెను. అయితే శంఖువు చిహ్నము విష్ణువును సూచించును. ఆ విష్ణువు కృష్ణుని రూపములో ఎదుటి పక్షమున ఉండెను. అందువలన దుర్యోధనునికి విజయము ప్రాప్తించదని తెలియజేసెను. ఏది ఏమైనప్పటికీ, యుద్ధమును నిర్వహించుట తన కర్తవ్యము కనుక దానిలో వచ్చు కష్టనష్టాలకు వెనుకాడే సమస్యే లేదని భీష్‌ముడు తెలియజేసెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement