Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 3
03
పశ్యైతాం పాండుపుత్రాణామ్‌
ఆచార్య మహతీం చమూమ్‌ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా ||

తాత్పర్యము : ఓ ఆచార్యా ! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపదతనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్పసేనను గాంచుము.

భాష్యము : గొప్ప రాజనీతిజ్ఞుడైన దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు చేసిన తప్పులను సరిదిద్దుకొనుటకు ఇప్పుడు తీవ్రముగా యుద్ధము చేయవలెనని సూచించుచుండెను. బ్రాహ్మణుడిగా ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నునికి విద్య చెప్పుట వలన ఈ రోజు అతడు పాండవుల పక్షాన చేరి ఎంతో నేర్పరితనముతో సైన్యాన్ని ఏర్పాటు చేసిన రీతిని చూసి, ద్రోణాచార్యుడు పాండవుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానమును విడనాడి యుద్ధము చేయవలసిన అవసరము ఎంతైనా ఉందని గుర్తుచేసెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement