Friday, January 24, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 59
59

విషయా వినివర్తంతే
నిరాహారస్య దేహిన: |
రసవర్జం రసో ప్యస్య
పరం దృష్ట్యా నివర్తతే ||

తాత్పర్యము : దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే యుండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు.

భాష్యము : దివ్యస్థితికి చేరుకోనంతవరకూ ఇంద్రియ వాంఛలను వదిలివేయలేరు. రోగికి తన రోగము నయమగుటకు పత్యాన్ని పాటించమని కొన్ని వస్తువులను స్వీకరించరాదని నియమములను విధిస్తారు. అయితే రోగికి అలాంటి నియమాలు నచ్చవు సరికదా, ఆ వస్తువులపైన మమకారమునూ వదులుకోడు. అలాగే ఇంద్రియములను నిగ్రహించుటకు యోగపద్ధతి అనుసరించి యమ, నియమ, ఆసన, ధారణ ఇలాంటి వాటిని కొందరు పాటించుటకు ప్రయత్నించుదురు. అయితే భగవంతుని యొక్క మధురమైన హృదయాన్ని అర్థము చేసుకొనుటకు సహాయము చేస్తే ఇటువంటి నియమాలు ఉపయోగపడతాయి. కాని లేకపోతే వాటంత అవి ఎక్కువ ప్రయోజనాన్ని కలుగజేయవు. కాబట్టి కృష్ణ చైతన్యమును పెంపొందించుకున్నట్లయితే భౌతికమైన వాటి పట్ల ఆసక్తి నశిస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement