Thursday, January 23, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 58
58

యదా సంహారతే చాయం
కూర్మో ంగానీవ సర్వశ: |
ఇంద్రియాణీంద్రియార్థేభ్య:
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

తాత్పర్యము : తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనెడి రీతి, ఇంద్రియార్థముల నుంది ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా నున్నవాడగుును.

భాష్యము : యోగికి గాని భక్తునికి గాని ఆత్మసాక్షాత్కారమునకు ప్రయత్నించు వ్యక్తికి గాని వారు ఇంద్రియములను ఏ విధంగా నియంత్రించగలుగుచున్నారనేదే నిజమైన పరీక్ష. సామాన్యులు ఇంద్రియములకు దాసులై, అవి చెప్పినవి చేస్తూ ఉంటారు. ఇంద్రియములు సర్పముల వలే ఇష్టానుసారము పరుగులు పెడుతూ ఉంటాయి. యోగి కాని, భక్తుడు కాని పాములవాడు పాములను నియంత్రించగలిగినట్లు ఇంద్రియములను నియంత్రించగలిగి ఉండవలెను. శాస్త్రములో విధులు, నిషేధాలు చెప్పబడినవి, వాటిని ఆచరించవలెనన్న ఇంద్రియ నిగ్రహము తప్పనిసరి. ఇక్కడ ఇచ్చిన తాబేలు ఉదాహరణ చాలా అర్థవంతమైనది. తాను కోరుకున్నప్పుడు తన కాళ్ళను, తలను లోపల ఉంచి, అవసరమైనప్పుడు బయటకు చాచును. అలాగే భక్తుడు కృష్ణుని సేవకు ఇంద్రియాలను ఉపయోగిస్తూ మిగిలిన సమయాలలో వాటిని నిగ్రహించవలెను. అర్జునుడు తన ఇంద్రియములకు ఇష్టములేదని యుద్ధము చేయననగా కృష్ణుని కోసము తన ఇంద్రియములను ఉపయోగించమని ఆదేశములు ఇవ్వబడినవి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement