Sunday, January 19, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 54
54

అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా
సమాధిస్థస్య కేశవ |
స్థితధీ: కిం ప్రభాషేత
కిమాసీత వ్రజేత కిమ్‌ ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ కృష్ణా ! సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణము లేవి? అతడు ఏ విధంగా భాషించును, అతని భాష ఎట్టిది ? అతడెట్లు కూర్చుండును, ఎట్లు నడుచును ?

భాష్యము : ప్రతి వ్యక్తి యొక్క స్థితిగతులను గుర్తించుటకు కొన్ని లక్షణములుండును. ఆ వ్యక్తి యొక్క మాటతీరు, నడక, ఆలోచన, భావాలు ఇలా కొన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అలాగే కృష్ణ చైతన్య వ్యక్తి ఒక్క ప్రవర్తన వ్యవహారము ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే భగవద్గీతను సంప్రదించవలెను. ముఖ్యముగా ఏ వ్యక్తి అయినా తన మాట్ల ద్వారా గుర్తించబడతాడు. మూర్ఖుడు మాట్లాడితే చాలు అతని విషయం అందరికీ అర్ధమవుతుంది. కృష్ణచైతన్యవంతుడు ఎల్లప్పుడూ కృష్ణునికి సంబంధించిన విషయాలనే మాట్లాడతాడు. ఇక మిగిలినవి వాటంతట అవే వ్యక్తమవుతాయి. వాటిని రాబోవు శ్లోకాలలో తెలియజేయటమైనది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement