Tuesday, November 26, 2024

గీతాసారం

ఆధ్యాయం 6, శ్లోకం 36

అంసయతాత్మనా యోగో
దుష్ప్రాప ఇతి మే మతి: |
వశ్యాత్మనా తు యతతా
శక్యోవాప్తుముపాయత: ||

తాత్పర్యము : మనస్సు నిగ్రహింబడనివానికి ఆత్మానుభవము అతి కష్టకార్యము. కాని మనోనిగ్రహము కలిగి, తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము.

భాష్యము : మనస్సును భౌతికమైన కార్యాల నుండి విడిపరచి సరైన మందునూ, సత్యాన్ని స్వీకరించినట్లయితే ఆత్మ సాక్షాత్కారములో విజయవంతము కాలేరని శ్రీకృష్ణుడు తీర్మానించుచున్నాడు. మనో నిగ్రహము లేకుండా యోగాభ్యాసము చేయుట అనగా, నిప్పులో నీరు సోసినట్లే లెక్క. దాని నుండి ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనము చేకూరదు. మనో నిగ్రహమనేది భగవంతుని సేవలో మనస్సును నిమగ్నము చేసినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి యోగాభ్యాసము చేసేవారు కూడా విజయాన్ని పొందాలంటే కృష్ణచైతన్యవంతుడు కావలసి ఉంటుంది. అయితే కృష్ణ చైతన్యవంతుడికి యోగాభ్యాసము యొక్క ల క్ష్యము సహజముగానే లభిస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement